నిత్యం యోగా చేసేవారికి యోగా నియమాలు పాటించని వారికి ఎంతో తేడా ఉంటుంది..యోగా శరీర దేహదారుడ్య రీత్యా..మానసికి ఆరోగ్య రీత్యా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది..యోగా చేసే వ్యక్తి యొక్క జీవన శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుదని..ఎంతటి పని చేసినా సరే అలుపుని ఎరుగడు..తన నెప్పి ,బరువు పెరగడం, తగ్గడం కొవ్వు తగ్గడం..ఇలా శరీరానికి కావలసిన ఆరోగ్య పద్దతులని యోగా క్రియ చేసుకుంటూ వెళ్తుంది... అన్నిటికన్నా ఎక్కువగా, మానసిక ఆనందం ఇచ్చే మార్గం యోగానే.

 

యోగా చేయడం వలన కలిగే సత్ఫలితారు

బరువు తగ్గుట..

చాలా మంది బరువు తగ్గడానికి అనేకరకాలుగా ఫిట్ నెస్ వర్క్ఔట్స్  చేస్తుంటారు..అంతేకాదు..డైట్ ఫాలో అవుతూ ఉంటారు..తిండి విషయంలో ఎంతో శ్రద్ద వహిస్తారు..అయితే ఒక్క సారి ఈ ప్లాన్ అంతా తప్పింది అంటే అప్పటి బరువు కంటే కూడా రెండు రెట్లు పెరుగుతారు..అందుకే యోగాని గనుకా నిత్యం క్రమం తప్పకుండా చేస్తుండటం వలన..తప్పనిసరిగా అధిక బరువును కోల్పోయి స్లిమ్ గా మారవచ్చు.

 

గర్భిణీలకుగర్భిణీలకు యోగా :

స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అలా ఆరోగ్యంగా ఉండాలి అనే మనసు ఎంతో ప్రశాంత పొందాలి..ఎన్ని టెన్షన్ లు ఉన్నా సరే ఒక్క యోగా సాధనతో వాటిని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు..నిత్యం యోగా చేయడం వల్ల అలసట, ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ, జీర్ణ క్రియ, శ్వాస క్రియ మెరుగవుతాయి, నాడీ వ్యవస్థ కూడా నియంత్రణలోకి వస్తుంది. మరోవంక, గర్భిణీ గా వున్నప్పుడు వుండే నిద్ర లేమి, నడుము నెప్పి, కాళ్ళు పట్టేయడం, అజీర్ణం చేయడం లాంటి సమస్యలనుంచి కూడా బయట పడవచ్చు.

 

మానసిక ప్రశాంతత :

యోగా యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం మానసిక ప్రశాంతత..ఏంటో ప్రసాంతమైన జీవితాన్ని గడపాలి అనుకునే వారు తప్పకుండా యోగాని అనుసరించాల్సిందే..దీని వల్ల మన దైనందిన కార్యక్రమాల్లో సాధారణంగా పట్టించుకోకుండా వుండే మెదడు లోని రెండు భాగాలను ఉపయోగించుకుని, అంతర్గత సంభాషణ పెంచుకోగలుగుతాము. యోగ సాధన చేయడం వల్ల మీ ఆలోచనాత్మక మెదడుకు, సృజనాత్మక మెదడుకు మధ్య సమన్వయం పెరుగుతుంది.

సాధారణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది :

 

మంచి ఆరోగ్యం అంటే రోగం లేకపోవడమే కాదు, నిజానికి మన మనసుకు, భావోద్వేగాలకు మధ్య సమతౌల్యం కలిగి వుండడం కూడా. యోగ సాధన చేస్తే మొత్తం మీద ఆరోగ్యం చేకూరి వివిధ రోగాలకు మిమ్మల్ని దూరంగా వుంచి, మిమ్మల్ని చురుగ్గా, ఆనందంగా, ఉత్సాహంగా తయారు చేస్తుంది.

మంచి రక్త ప్రసరణ :

వివిధ యోగ భంగిమలు..శ్వాస ప్రక్రియల సంయోగంతో, యోగా మీ శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. రక్త ప్రసరణ బాగుంటే, ప్రాణ వాయువు, ఇతర పోషకాలు శరీరంలో చక్కగా సరఫరా అయి ఆరోగ్యకరమైన అవయవాలు, మెరిసే చర్మం కలిగి ఉండేలా చేస్తాయి.

స్థిరమైన పొట్ట కోసం :

యోగా చేయడం వలన పొట్ట పెరగదు సరికాద ఎంతో ధృడంగా మీ పొట్ట తయారవుతుంది...తక్కువ సమయంలో పెద్దగా శ్రమ పడకుండా అధిక కొవ్వును తగ్గించడం సాధ్యమని చెప్పే మాటలని మీరు పాటించకండి.. మీకు ఇప్పటికే చదునైన పొట్ట వుంటే నిత్యం సాధన చేస్తే యోగా లో నౌకాసనం, ఉష్ట్రాసనం, ఇంకా కొన్ని మౌలిక భంగిమలు దాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. యోగ సాధన చేస్తూ సరైన ఆహార ప్రణాళిక పాటిస్తే మీ పొట్ట తగ్గిపోయే అవకాశం వుంది.

ఆరోగ్యకరమైన గుండె :

శరీరంలో రక్త ప్రసరణ యోగా చేయడం వలన సులభంగా జరుగుతుంది అయితే ఇలా యోగా  చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే గుండెకి సంభందించిన వ్యాదులు అన్నీ దూరం అవుతాయి..గుండె కి రక్తాన్ని చేరవేసే నాళాలలో కొవ్వు పేరుకుని ఉండటం వలన అది త్వరగా తగ్గిపోతుంది..దాంతో గుండె ఆరోగ్యంగా  ఉంటుంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: