మన భారత ప్రధాని నరేంద్ర మోడి యోగా గురించి ఎన్నో మంచి విషయాలు వెల్లడించారు..యోగా అనేది ప్రతీ మనిషి తప్పకుండా పాటించవలసిన ప్రత్యేకమైన భాద్యతాయుతమైన పని అని అన్నారు..యోగాలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయని మోడీ చెప్తారు..ఈ రోజు ప్రపంచం మొత్తం జూన్ 21 న యోగా దినోత్సవం జరుపుకుంటోంది అంటే..భారత సంపద అయిన యోగా ప్రపంచ దేశాలకి విస్తరిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం ప్రధాని మోడీ నే అనేది సత్యం.. ఏకంగా ప్రధాని మోడీ తానూ పాటించే యోగా నియమాలని చేసి మరీ ప్రపంచానికి చూపించారు.

 Related image

అంతేకాదు ప్రధాని మోడీ చేసే యోగా ఆసనాలు ఆయన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు.. కొన్నిసార్లు, ఒక విషయంపై మనం పని చేస్తున్నపుడు, మన శరీరం ఒక దగ్గర మన మనస్సు ఒక దగ్గర ఉన్నట్లుగా గమనించవచ్చు, అయితే ఈ విధంగా వుండడం వలన మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుందని" వ్యక్తం చేసారు. హృదయపూర్వకంగా, మనస్సును మరియు శరీరాన్ని సమకాలీకరించేదే యోగా అని తెలిపారు. 
Image result for modi recommended yoga process

అయితే ప్రతీ ఒక్క పౌరుడు తప్పకుండా నేర్చుకోవలసిన యోగాసనాలు గురించి ఇక్కడ మోడీ స్వయంగా వివరించి చెప్పారు..ఈ ఆసనాలని గనుకా పాటిస్తే తప్పకుండా మీరు ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు మరియు ఆత్మ కలిగి వుండడానికి సంపూర్ణ పద్దతిలో ఉపయోగపడుతాయని ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు..మోడీ తెలిపిన ఆసనాల వివరాలలోకి వెళ్తే..

సుఖాసన

Image result for modi yoga instructions

సుఖాసన ఈ పేరుని రెండు సంస్కృత పదాల నుండి తీసుకోవడం జరిగింది అవి “సుఖః” అంటే “సుఖము” అని, “ఆసన” అంటే “భంగిమ” అని అర్ధం...ఈ ఆసనం కోసం మనం చాపపై కూర్చోవాలి..మరియు కాళ్ళను ముందుకు చాపాలి. మీ కాళ్ళను ముందుకు నేరుగా చాపి ఉంచాలి. ఇప్పుడు, మీ ఎడమ మోకాలిని మడచి, మీ కుడి కాలి తోడ లోపలి వైపు వచ్చేలా వుంచండి. సౌకర్యవంతమైన విధంగా కూర్చోండి. ఇపుడు, మీ కుడి మోకాలిని మడచి దాని చివరి భాగం మీ ఎడమ కాలి తోడ లోపలి వైపు వచ్చేలా వుంచండి. మీ వెన్నుముక నిఠారుగా ఉండేట్లుగా చూసుకోండి. ఈ ఆసనం మీ మెదడుకి ఉపశమనాన్ని కలిగిస్తుంది, ఫలితంగా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మెరుగవుతుంది మరియు ఎంతో ధృడమైన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.


పద్మాసన

Image result for modi padmasan

ఈ ఆసనం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆసనం ఎంతో మంది ఋషుల యోగ నిద్రని చూసినప్పుడు ఈ పద్మాసనం ఎంచుకుంటారు..ఈ భంగిమలో కాలుమీద కాలు వేసుకొని, వెన్నుముకను నిలువుగా, నిఠారుగా వుంచి కూర్చోవాలి, ఇది మీరు ధ్యానంకు మరియు ఏకాగ్రతతో కూర్చునేలా చేస్తుంది. ఈ ఆసన వలన మెదడుకి ఉపశమనం కలిగించడంతో ప్ర్రారంభమై అవగాహన, ఏకాగ్రత మరియు శ్రద్ధను పెంచుతుంది. క్రమం తప్పకుండా పద్మాసనను సాధన చేస్తే మంచి శరీర ఆకృతి అభివృద్ధి చేయడానికి మరియు కీళ్ళు మరియు స్నాయువులు అనుకూల విధంగా ఉంచడానికి సహాయపడుతుంది.


ఉస్తారాసన


ఉస్తారాసన లేదా ఒంటె భంగిమ, ఇది మీ అంతర్గత శక్తిని మరియు మీ వెన్నుముక, నడుము, భుజాలలో అవసరమైన విధంగా సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇది చిన్న భంగిమ అయినప్పటికీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు అత్యద్భుతంగా వుంటాయి అవి మీ జీర్ణ, శ్వాస, ఎండోక్రైన్ (వినాళగ్రంధి), శోషరస, అస్థిపంజర, రక్తప్రసరణ వ్యవస్థల పరిస్థితులను మెరుగుపరుస్తుంది.


వజ్రాసన


వజ్రాసన లేదా డైమండ్ ఈ భంగిమ చాలా సాధారమైనది దీనిని భోజనం చేసాక అభ్యసించాలి. ప్రతి రోజు వజ్రాసన అభ్యాసం మీరు ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన శరీరం నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలైన మలబద్ధకం వంటి వాటిని తగ్గిస్తుంది మరియు కాళ్ళు, వెనుక భాగ కండరాలను శక్తివంతం చేస్తుంది.దైనందిక జీవితంలో ఈ ఆసనాలు మనిషిని ఎంతో ఉత్తేజంగా ఉంచుతాయి అంతేకాదు ఎన్నో రకాలుగా శ్రమతో కూడి వచ్చిన వ్యక్తి ఒక్క సారి ఈ ఆసనాలని ప్రారంభించడం ద్వారా ఎంతో ఉపసమనం పొందుతాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: