చద్దన్నాన్ని చాలా మంది చుల‌క‌న‌గా చూస్తారు.ఇది ప‌ట్ట‌ణాల‌కే కాదు..ప‌ల్లెల‌కు పాకింది.ఇప్ప‌టికీ చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు.అందుకే వాళ్లు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా వంద సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా జీవించారు.కాని ఇప్పుడు వ‌స్తున్న ఆహార‌పు అల‌వాట్ల‌వ‌ల్ల క‌నీసం 60 సంవ‌త్స‌రాలు కూడా బ్ర‌త‌క‌డంలేదు. అదే టౌన్ లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే మార్నింగ్ పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు. కానీ రాత్రిపూట మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. 


పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంచుకుని తినేవారు .. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .. 100 ఎడ్లు బ్రతికేవాళ్లు. అందుకే  చ‌ద్ది అన్నం తిన‌డం వ‌ల్ల ఉన్న ఉప‌యేగాలు ఏదానికి లేవ‌ని కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలను బ‌య‌ట‌పెట్టారు. దీని వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో ఉప‌యేగాలు ఉంటాయ‌న్నారు.


అసలు విసయానికివస్తే అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐర‌న్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు కాల్షీయం కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.


ఉద‌యం - చ‌ద్ద‌న్నం ప్ర‌యోజ‌నాలు :
1. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
2. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే ఉద‌యం సద్దన్నం తినాలి.
3.  పలు చర్మ వ్యాధులకు చ‌ద్ద‌న్నం దివ్యౌష‌ధం.
4. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
5. శరీరంలో రోగనిరోధ‌క శక్తి ని పెంచుతుంది.
6. మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: