గోళ్లు కొరకడమనేది చాలామందికున్న ఓ హ్యాడ్ హాబిట్. దీనిని ఏమాత్రం మార్చుదామనుకున్నా…. కుదరని అలవాటు. దాంతో చాలామందికి గోళ్లు కొరుకుతూ లేని పోని సోషల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు.  టివి చూస్తున్నప్పుడో, పుస్తకం చదువుతున్నప్పుడో కొందరు గోళ్లు కొరుకుతుంటారు. ఇది మార‌లేని ఓ అలవాటుగానూ మారుతుంటుంది. నిజానికి దీంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఈ అలావాటు వ‌ల్ల  దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెప్తూనే వున్నారు. 


గోళ్లును కొరకడం ద్వారా గోటిలోని మురికి శరీరంలోనికి పోతుంది. తద్వారా ఈ-కోలీ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి శ‌రీరంలోకి వెళుతుంది. ఇలా చేయ‌డం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు. గోళ్లను కొరికినపుడు ఇవి ముందు నోట్లోకి.. అక్కడ నుంచి పేగుల్లోకి చేరుకుంటాయి. ఇవి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఫలితంగా అతిసారం, కడుపునొప్పి వంటి సమస్యలు దాడి చేస్తాయి. 


గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఎక్కువే. నిరంతరం గోళ్లు కొరకటం వల్ల దంతాల ఆకారమూ దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ కూడా రావచ్చు. దీర్ఘకాలంగా గోళ్లు కొరికే అలవాటు గలవారికి పారానైకియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఉంది. వీరి వేళ్ల చివరన చర్మం మీద పడే పంటిగాట్ల ద్వారా బ్యాక్టీరియా లేదా ఈస్ట్‌ లోపలికి ప్రవేశించి గోళ్ల కింద వాపు, చర్మం ఎర్రబడటం, చీము పోగుపడటం వంటి సమస్యలు వస్తాయి. ఏదేమైనా గోళ్లు కొరికే అల‌వాటు ఉన్న వారు దీని నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌పడ‌డం మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: