పండ్ల రసాలు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని మనందరికీ తెలిసిందే. శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం మనం సొంతం అవుతుంది. రోజూ ఓ కప్పు యాపిల్  జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పండ్లే కాకుండా కూరగాయల జ్యూస్‌లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
అలాగే బీట్‌రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయి. బీట్ రూట్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, సౌందర్యానికి పెంచే విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- బీట్ రూట్ జ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది . బీట్ రూట్ పేస్ట్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. దీని వ‌ల్ల ముఖం గ్లో వ‌స్తుంది.


- రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలు కూడా పూర్తిగా మ‌టుమాయం అవుతాయి.


- పెదాలు నేచురల్‌గా పింక్ కలర్లో ఉండాలని కోరుకుంటే బీట్ రూట్ రసాన్ని పెదాల మీద అప్లై  చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా రాత్రుల్లో చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


- బీట్ రూట్ జ్యూస్ చిక్కగా చేసి, ముడుతలున్న ప్రదేయంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ముడుతలు మాయం అవుతాయి. బీట్ రూట్ మాస్క్ కనీసం వారానికి రెండు సార్లు వేసుకోవాలి.


- ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


- బీట్ రూట్ రసం మరియు షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రైబ్‌ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి.


- బీట్ రూట్ జ్యూస్‌లో కొద్దిగా తేనె మరియు పాలు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. తేమగా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: