కొత్తిమీర సాధారణంగా దీనిని రుచికోసం ఆహార తయారీలలో వాడుతూ ఉంటాము. కానీ కొత్తిమీర వలన రుచి మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పీచు శాతం చాల ఎక్కువ. మెగ్నీషియం, మాంగనీస్లూ, ఇనుము, కొత్తిమీరలో అధికంగా లభిస్తాయి. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది.


కొత్తిమీరను సాధారణంగా, రుచి కోసమే కాకుండా వైద్యసంబంధమైన ఔషదాల తయారీలలో కూడా వాడతారు. దీని వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వల్ల‌, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవును.


- కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును.


- కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.


- కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి,  మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును.  


- కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. 


- కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. 


- కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా?  అవును ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.


- కీళ్ళ నొప్పులతో భాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా  కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనోప్పులను తగ్గిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: