సగటున ప్రతి మానవుడు రోజులో 14 సార్లు శరీరం నుండి గ్యాస్ ను భయటకి విడుదల అవుతుంది. గ్యాస్ ఉన్న వారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం. కడుపులో మంట. పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు పడుతున్నారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందటమేలా?  గ్యాస్ ఎందుకు తయారవుతుంది. దాని నివారణకు ఇంట్లోనే చేసుకునే చిన్నపాటి చిట్కాలు మీ కోసం.


మనం తినే ఆహారం. నమలకుండా గబగబా మింగడం. మాట్లాడుతూ తినడం. నోరు ఎక్కువగా తెరచి నమలడం. బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. అంతే కాదు..స్మోక్ చేయడం. ఆహారనాళంలో జీర్ణం కానీ షుగర్స్ ను కోలన్ లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను విడుదల చేస్తాయి. ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. 


మరి గ్యాస్ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు: ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి. ధూమపానం, జర్దా, పాన్ వంటివి తినకూడదు. కొన్ని వ్యయమ పద్ధతులు పాటించాలి. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకి భోజనం చేయాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి.


నివారణకు వంటింటి చిట్కాలు:
-  తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. 


- ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. 


- అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి. 


- కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి. 


- గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది.


- మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.


- తులసి ఆకులు న‌మిలితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: