స‌హ‌జంగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. పంచదారను అధిక మోతాదులో తీసుకుంటే ఊబకాయం, డయాబెటీస్‌, దంత సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పంచదార వల్ల ఇన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. చక్కెర మనిషి ప్రవర్తనపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనల్లోనూ వెల్లడయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..


మతిమరపు: చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో ఆరు వారాల పాటు ఫ్రక్టోజ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలుక తన బొరియలోకి వెళ్ళడాన్ని కూడా మర్చిపోయంది. చక్కెర అత్యధికంగా తీసుకోవడం వల్ల మెదడులోని కమ్యూనికేషన్‌ కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. దీని వల్ల నేర్చుకునే శక్తి పూర్తిగా మందగిస్తుంది.


ఒత్తిడి: చక్కెరను తీసుకోవడం వల్ల ఒత్తిడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోతారు. చక్కెర తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రవర్తన కూడా సక్రమంగా ఉంటుంది.


డిప్రెషన్‌: డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. మిగిలిన వారితో పోలిస్తే ఇలాంటి వారిపై చక్కెర ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం రక్తంలో చక్కెర నిల్వల్లో వచ్చే హెచ్చుతగ్గులు. దీంతో మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. నిత్యం చక్కెరను మోతాదుకు మించి తీసుకుంటే డిప్రెషన్‌కు గురవుతారు.


వ్యసనం: చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక వ్యసనం వంటిదే అని పరిశోధనల్లో వెల్లడయింది. చక్కెర కూడా మద్యంలాగే మెదడులోని ఫీల్‌ గుడ్‌ హర్మోన్‌ను విడుదలను ఆడ్డుకుంటుంది. అందుకే చ‌క్కెర‌ను మోతాదులో తీసుకోవాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: