బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బెల్ల పూర్వం ఎక్కువగా వినియోగించే వారు. అందుకే ఆ కాలంలో షుగర్ వంటి వ్యాధులు దరి చేరేవి కావు. ప్రస్తుతం పంచదార వాడకం ఎక్కువైంది. రోగాలూ ఎక్కువయ్యాయి. బెల్లంలో ఉన్న ఔషధ గుణాలు పంచదారలో లేకపోవడమే కాదు.. చెడు గుణాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే పంచదారను తెల్ల దెయ్యం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.


పంచదారలో ఎన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయో… బెల్లంలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం రెండు రంగుల్లో దొరుకుతుంది. వీటిలో కొద్దిగా రంగు తక్కువగా ఉండే బెల్లం మిగిలిన వాటికంటే మంచిది. తెల్ల బెల్లం అంత శ్రేష్టం కాదని ఆయర్వేదం చెబుతోంది. ఆయుర్వేద వైద్యంలో బెల్లం ఎక్కువగా వాడతారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు… వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెల్సుకుందాం. ప్రతీ రోజూ బెల్లాన్ని మీ ఆహారంలో ఏదో రూపంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.


- లో-షుగర్ తో బాధపడుతున్న వారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే… వెంటనే వారి ఎనర్జీ లెవెల్స్ పెరిగి షుగర్ నార్మల్ కి వస్తుంది.


- బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే బెల్లం శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల స్దాయిని కాపాడుతుంది. 


- బెల్లంలో రక్తన్ని శుద్ది చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.


- బెల్లంలో రక్తపోటును నివారించే పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటే గుండె సమస్యలు రావని వైద్య నిపుణులు అంటున్నారు.


- స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వారు బెల్లంతో చేసే స్వీట్స్ తింటే కొలెస్ట్రాల్, ఊబకాయ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.


- ప్రతిరోజూ బెల్లం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి… దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దరి చేరవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


- స్త్రీలకు నెలసరిలో వచ్చే నొప్పి.. ఇతర రుతు సమస్యలకు బెల్లం దివ్యౌషధం.


- రోజు పెరుగు అన్నం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తే రక్తం శుద్ది అవ్వడమే కాక జీర్ణ శక్తిని పెంచుతుంది. అందుకే ప్రతీ రోజూ బెల్లాన్ని మీ ఆహారంలో ఏదో రూపంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: