ప్రస్తుతం గురక అనేది చాలా సాధారమైపోయింది. పెద్దవారిలో దాదాపు 45 శాతం మందికి గురక వస్తోంది. గురక పెట్టడం వల్ల పక్కన నిద్రించే వారు ఇబ్బంది పడతారు. గొంతులోని కండరాలు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వైబ్రేట్ అయినప్పుడు శబ్దం వచ్చి గురక మొదలవుతుంది. గుర‌క వ‌ల్ల చాలామందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు. ఇది గురక పెట్టేవారికన్నా ఎక్కువ.. పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంది. రాత్రి గురక వల్ల పగలు అలసట, చిరాకు, మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది.  అయితే గురకను నిలుపు చేయడానికి సహాయపడే కొన్నిచిట్కాలు ఇప్పుడు చూద్దాం..


- గురక నిలపడానికి, ఆవిరి పట్టడం చాలా సింపుల్ హోం రెమెడీ. ఇది శాస్వనాళంలో మ్యూకస్ ను బయటకు నెట్టివేయడం వల్ల నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. దాంతో శ్వాస ఫ్రీగా ఆడుతుంది.


- నాలుక టిప్ ని కంది మునుపటి పళ్లకు ఆనించి నాలుక వెనక భాగాన్ని నోటి పై భాగానికి మరియు కొండనాలుకకు తగిలేలా చేయాలి. ఇలా చేస్తూ ఇంగ్లీష్ లోని ‘A’ అనే అక్షరాన్ని పలకాలి.


- వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది. నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి.


- గురక పెట్టేవారు తమ నాలుక టిప్ ని నోట్లిని పై భాగానికి ఆనిస్తూ ఉండాలి. ఇలానేమ్మదిగా నాలుకను వెనక్కి నెడుతూ ఉండాలి. 10 నుంచి 15 సెకండ్స్ ఇలా చేసి కొన్ని క్షణాల గ్యాప్ ఇచ్చి అలా తరచుగా చేస్తూ వుండాలి. ఇలా చేయ‌డం గురక‌ను త‌గ్గించ‌వ‌చ్చు.


- రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగడం వల్ల గురక దూరం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: