'' మనిషిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు నిరంతరం జరుగుతాయి. అంటే ఆక్సిజన్‌ పీల్చుకొని, కార్బన్‌డై ఆక్సైడును వదిలిపెడుతుంటాం. ఈ ప్రక్రియ రాత్రి సమయంలో నిద్రపోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే ఆక్సిజన్‌ పీల్చుకొంటూ, కార్బన్‌డై ఆక్సైడు ముక్కుద్వారా, కొంత నోటి ద్వారా బయటకు వస్తుంది. నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు నోట్లో ఉమ్మి (లాలాజలం)లో ఉండే కాల్షియంతో కార్బన్‌డైఆక్సైడ్‌ రసాయనిక చర్య జరిగి, కాల్షియం (సున్నపు తేట)ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాలవలె తెల్లగా మార్చును అనే ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెలువడిన వాయువు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అని నిర్ధారణ అవుతుంది.


ఈ విధంగా ఏర్పడిన పాలవంటి ద్రావణం సెటిలయి, నాలుకమీద పేరుకొని తెల్లని పదార్థం ఏర్పడుతుంది. దీనికి తోడు మనం తిన్న ఆహారపు తునకలు, బ్యాక్టీరియా కలిసి నాలుక మీద ఒక తెల్లని పొర మాదిరిగా ఏర్పడుతుంది. దీన్ని మనం పాచి (ప్లేక్‌) అంటాం. సాధారణంగా పిల్లలు ఉదయాన్నే ముఖం కడుక్కోవటానికి మారాం చేస్తుంటారు. సరిగ్గా పళ్ళను శుభ్రం చేసుకోకపోవటం వలన పాచి పళ్ళమధ్య సందుల్లోను, చిగుళ్ళ కిందుగ పేరుకుపోయి ముద్దలాగా ఏర్పడి అనేక దంత సమస్యలకు మూలం అవుతుంది..'' అని  ప్రముఖ దంత వైద్యులు డా.ఓ.నాగేశ్వరరావు, అన్నారు.


పిల్లలకు అరుదైన కానుక డెంటిస్ట్‌ అంకుల్‌!!
చిన్నారులకు తరచూ వచ్చే దంత సమస్యల డా.నాగేశ్శరరావు రాసిన 'డెంటిస్ట్‌ అంకుల్‌ ' పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మంగళవారం రవీంధ్రభారతిలో జరిగిన కార్య క్రమంలో ఆవిష్కరించారు. శృతిలయ ఆర్ట్‌ ఆకాడమీ, డా.రావూస్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ 'పిల్లలతో పాటు పెద్దలకు దంతసమస్యల పై అవగాహన ఉండాలి. డా.నాగేశ్వరరావు రాసిన ఈ పుస్తకం అన్ని రకాల దంత వ్యాధుల పై చక్కని అవగాహన కల్పించే దిశగా ఉంది'' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను వైద్యరత్న,సేవారత్న పురస్కారాలతో సత్కరించారు. (డెంటిస్ట్‌ అంకుల్‌ పుస్తకాలు కావాల్సిన వారు డాక్టర్‌ నాగేశ్శరరావుగారికి 9849014562 ఫోన్‌లో సంప్రదించండి. ) 


మరింత సమాచారం తెలుసుకోండి: