స‌హ‌జంగా శ‌రీరానికి అవసరమైన అతిముఖ్యమైన ఖనిజం క్యాల్షియం.  శ‌రీరం స్ట్రాంగ్ గా, హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. దానికోసం రోజు క్యాల్షియం టాబ్లెట్లు మింగటం కొందరికి అలవాటుగా మారుతుంది. ఎముకలు ప‌టిష్ట‌త‌, దంతాల ఆరోగ్యం క్యాల్షియం పై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అత్యవసరమైన మినిరల్ లోపించడం వల్ల ఎముకలు పెళుసుగా మారడం, విరగడం, ఓస్ట్రియోఫోసిస్ సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 


అంతే కాకుండా కండరాలు సంకోచ వ్యాకోచాలకు క్యాల్షియం అవసరం. రుతుక్రమం సమయంలో వచ్చే అనేక రుగ్మతలను కాల్షియం తగ్గించగలదు. క్యాల్షియం పరిమాణం తగ్గితే హార్ట్ కు సంబంధించిన సమస్యలు, మజిల్ క్రాంప్స్, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. మ‌రియు అనేక రకాల నొప్పులకు దీని లోపమే కారణం. పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. 


క్యాల్షియం కోసం టాబ్లెట్ లపై ఆధారపడకుండా మనం తినే ఆహారంలో కాల్షియం బాగా లభించే పదార్థాలు సమకూర్చుకోవాలి. యవ్వనంలో ఉన్నప్పటి నుండి శరీరానికి తగినంత క్యాల్షియం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాల్షియం లోపిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాల్షియం ఎక్సెస్ అయినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. క్యాల్షియం ఎక్కువైనా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుట, క్యాల్షిఫికేషన్ టిష్యులు, హార్ట్ డిసీజ్ లు పెరుగుతాయి. అయితే ముందుగా క్యాల్షియం లోపానికి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 


ఈ క్ర‌మంలోనే ముఖ్యంగా పాలు తీసుకోవ‌డం వ‌ల్ల మంచిది. పాలలో అత్యధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. అలాగే వరి, గోధుమ, బంగాళదుంప, కాకర, క్యాప్సికం, మామిడికాయ, నారింజ రసం, దానిమ్మ, బాదం, ఎగ్స్‌, నువ్వులు ఇలా క్యాల్షియం ఉన్న ఫుడ్స్ మన తినే ఆహారంలో చేర్చుకోవ‌డం చాలా మంచిది. అదే విధంగా అధిక క్యాల్షియం ఏర్ప‌డ‌కుండా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: