మంచి ప‌నుల‌కు స‌మాజంలోని అన్నివ‌ర్గాలు త‌మ స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తాయి. అలా అవ‌య‌వ‌దానానికి ముందుకు వ‌చ్చిన ఓ వ్య‌క్తికి చెందిన గుండెను...మ‌రో వ్య‌క్తికి అమ‌ర్చేందుకు పోలీసులు సైతం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సామాన్యులు స‌హ‌క‌రించారు. వివ‌రాల్లోకి వెళితే...బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండె మార్పిడి కోసం హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసులు గ్రీన్ కారిడార్‌ పేరుతో ట్రాఫిక్ నిలిపివేసి గుండె మార్పిడి చికిత్స‌ను విజ‌య‌వంతం చేసేందుకు అండ‌గా నిలిచారు.


బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తికి గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆయ‌న ప్ర‌స్తుతం నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయ‌న‌కు అమ‌ర్చే వ్య‌క్తి హృద‌యం సికింద్రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రిలో ఉంది. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి నాంపల్లి కేర్‌ ఆస్పత్రి వరకూ సాధార‌ణ ట్రాఫిక్‌లో ఆ గుండెను త‌ర‌లించ‌డం వ‌ల్ల నిర్దేశిత స‌మ‌యం దాటిపోవ‌డంతో...ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో, ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు గ్రీన్ చాన‌ల్ ఏర్పాటు చేశారు.  గ్రీన్‌ కారిడార్ ద్వారా ఈ మార్గంలో కాసేపు రాకపోకలను నిలిపివేయనున్నారు. పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకొని గుండెను స‌రైన స‌మ‌యానికి చేర్చ‌డం వ‌ల్ల బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తికి వైద్యులు గుండెను అమర్చనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: