పెరుగుతున్న ఒత్తిడితో తగ్గుతున్న లైంగిక సామర్ధ్యం అనే వార్తలు మనం నిత్యం వింటూనే వుంటాం.ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో జీవనవిధానం పూర్తిగా మారి పోయింది..భాగస్వామి పట్ల ఆసక్తి లేక పోవడం,జ్ఞాపక శక్తి తగ్గడం,జీర్ణ శక్తి సరిగ్గా పని చేయక పోవడం,సరైన పోషకాలు,విటమిన్స్ వున్న ఆహారాన్ని తీసుకోకపోవడం.మానసిక సంఘర్షణ తదితర సమస్యలతో ప్రతి నిత్యం ఓ యుద్దమే ఈ జీవితానికి..ఒక్కోసారి చీ వెధవ జీవితం ఏంటో అర్ధంకాదు అనిపిస్తుంది.మొదట మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్ని వుంటాయి.కోట్లు విలువ చేసే ఆరోగ్యమే సరిగ్గా లేకుంటే,అంతడబ్బు వుండి ఏం లాభం.అందుకే నిండు నూరేళ్లు కాకపోయిన ఉన్నంతలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి...ఇక శృంగారానికే కాదు యవ్వనానికి,నిండైన ఆరోగ్యానికి అందుబాటులో వున్న పండు ఏంటో తెలుసా దానిమ్మ..ఈ పండువల్ల లాభాలు అన్ని ఇన్నని చెప్పలేం.మీరే చదివి తెలుసుకోండి.. 




1.ఈ పండు లైంగిక కోరికలను పెంచే సహజపదార్థంగా చెప్పవచ్చు ఎలాగంటే...
దానిమ్మ గింజలలో రక్తపోటు తగ్గించడంతో పాటు మనిషిలో మారే మూడ్ పై సానుకూల ప్రభావాలు చూపే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.ఈ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి.ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను కలిగిస్తాయి.

2.ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది...
దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని మరియు ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి.ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి.మీకు కీళ్ల నొప్పులు ఉంటే తరచుగా దానిమ్మలను తినడం వల్ల ఉపయోగముంటుంది..

3.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది...
దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్లు,మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపర్చి,హానికారక ఆక్సీకరణం చెందిన లిపిడ్లను విఛ్చిన్నం చేస్తాయి,అలా ఆర్థెరోస్క్లెరోసిస్ రిస్క్ ను తగ్గిస్తాయి..




4.క్యాన్సర్ ను నివారిస్తుంది..
దానిమ్మ గింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది.ఈ గింజలలో వుండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాలు పాకకుండా,ఎక్కువగా పెరగకుండా,క్యాన్సర్ సోకిన కణాలు చనిపోయేలాగా పురిగొల్పుతాయి.

5. మధుమేహానికి మంచిది..
దానిమ్మ గింజలు డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరం.ఈ గింజలలో ఉండే కొన్నిరకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగిఉంటాయి.దానిమ్మ గింజలలో వున్న పిండి పదార్థాలలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండి అవి టైప్ 2 డయాబెటిస్ ను నివారించటంలో సాయపడతాయి.

6.వాపులతో పోరాడటంలో సాయపడుతుంది..
దానిమ్మ గింజలను తినటం వలన వాపులు మరియు వాపు సంబంధ డిజార్డర్లతో పోరాడటంలో సాయం లభిస్తుంది. అధ్యయనాలలో తేలింది ఏంటంటే దానిమ్మ గింజలు తినడం వలన ఫ్రీగా తిరిగే హానికర రాడికల్స్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ నష్టాన్ని మరియు వాపును తగ్గిస్తాయి..

7.పళ్ళను బలపరుస్తుంది..
దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి,వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా పోరాడుతాయి.




8.జీర్ణశక్తిని పెంచుతుంది..
దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి,ఎందుకంటే వీటిలో బి- కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి.ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు,ప్రొటీన్లు మరియు కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి.దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యం.

9.బరువు తగ్గటానికి సాయపడుతుంది..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? దానిమ్మ గింజలను తినండి,అవి బరువు తగ్గటంలో సాయపడతాయి.వాటిల్లో ఉండే పీచుపదార్థం చాలాసేపు వరకు మీ కడుపు నిండి వున్న ఫీలింగ్ కలిగిస్తుంది.దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి,కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.

10.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది..
దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.వివిధ వ్యాధులను తెచ్చి మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా మరియు వైరస్ లతో అద్భుతంగా ఈ గింజలు పోరాడతాయి. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి..

ఇక రోజుకి ఒకగ్లాసు చొప్పున పదిహేను రోజుల పాటు దానిమ్మరసం తాగినవారిలో సెక్స్ హార్మోనైన టెస్టోస్టీరాన్ మోతాదులు 16-30% పెరుగుతున్నట్టు తేలింది.ఎడిన్‌బరోలోని క్వీన్ మార్గరెట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల 21-64 ఏళ్ల వారిని ఎంచుకొని చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని తెలుసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: