స‌హ‌జంగా ప్రొటీన్లు శరీరానికి అత్య‌వశ్యకమైన పోషకాల‌న్న‌ విషయం అందరికీ తెలిసిందే. అందుకని బాడీని పెంచుకోవడం కోసం, బరువును తగ్గించుకోవడం కోసం ఆలోచించకుండా అత్యధికంగా ప్రొటీన్లు తీసుకుంటాం. నిజానికి ప్రొటీన్లు శరీరంలోని భాగాలను  దృఢ పరుస్తూ కండరాలను పునరుద్ధరిస్తుంది. కానీ వీటిని ఒక మోతాదు వరకు తీసుకోవాలి. ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అనర్ధాలు తప్పవు. ఈరోజుల్లో జిమ్‌లో వ్యాయామం చేసే వాళ్ళు ప్రోటీన్స్ షేక్‌ తాగడం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు.


వాస్త‌వానికి మన శరీరం ప్రతి గంటకు ఐదు ప్రోటీన్లు మాత్రమే జీర్ణించుకుంటుంది. కానీ ప్రోటీన్స్ షేక్‌లో 50 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వీటిని జీర్ణించుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజులో 30 శాతం కన్నా అధికమైన ప్రొటీన్లు తీసుకుంటే కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. అంతే కాక అధికమైన ప్రొటీన్లు శ‌రీరంలో ఫ్యాట్‌గా మారతాయి. దీంతో బరువు పెరుగుతారు. 


అలాగే శరీరంలోని కాల్షియం నిరుపయోగమవుతుంది. దీంతో అలసట, కళ్ళు తిరగడం, వెంట్రుకలు రాలడం, చర్మం పొడిబారడం, ఆకలి తగ్గటం, వికారంగా ఉంటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో, ప్రోటీన్ షేక్ అధికంగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువ‌గా ఉంటుంది. 


అందుకని ప్రతిరోజు 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. అస్సలు తీసుకోకుండా ఉన్నా శ‌క్తిహీనుల‌వుతారు. 150 గ్రాముల చికెన్‌లో 37 గ్రాముల ప్రోటీన్లు, ఒక ఎగ్‌లో ఐదు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అందుకని వీటిని అధికంగా తీసుకోవ‌డం అంత మంచిది కాదు. ప్రోటీన్ మితంగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి చాలా ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి: