ఈ రోజు మీ జుట్టు పెరుగుదలకు సంబంధించిన అద్భుతమైన చిట్కాను  తెలుసుకోండి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, పొల్యూషన్, ఒత్తిడీ, నిద్రలేమి ఇలాంటి కొన్ని కారణాల వల్ల చిన్న వయసులోనే హెయిర్ లాస్ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. ఈ సమస్య ఇటు యువతీ యువకుల్లో చాలా ఉధృతంగా ఉంది. దీనికి తోడు తెల్లజుట్టు సమస్య. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా కొన్ని రోజులు పాటించటం ద్వారా ఏదైతే మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య తగ్గిపోయి ఆరోగ్యవంతమైన, ఒత్తైన, పొడవైన జుట్టు మళ్లీ మీరు తిరిగి పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలో, ఏయే పదార్థాలు కావాలో ఓసారి తెలుసుకుందాం.


ఈ చిట్కా తయారు చేసుకోవడానికి కావలసిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం మందారం పువ్వులు, మందారపూలను ఎండబెట్టి డ్రైగా చేసుకోవాలి. మందారం లో విటమిన్ సీ తో పాటు అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో అద్భుతమైన అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది తలలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి వెంట్రుకల కుదుళ్లకు కావల్సిన పోషణ అందించి వెంట్రుకల రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ రెట్టింపు చేస్తుంది. ఏదైతే మిమ్మల్ని బాగా బాధిస్తున్న హెయిర్ లాస్ సమస్య ఉందో మరియు తెల్లజుట్టు సమస్య ఉందో ఈ సమస్యలను అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన ఒత్తైన పొడవైన కురులను మళ్లీ మీకు తిరిగి పొందటంలో మందారపూలు ఎంతగానో సహాయపడతాయి.


అలాగే  ఈ చిట్కా తయారు చేసుకోవటం కావలసిన రెండో పదార్థం మెంతులు. మెంతుల్లో కూడా మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో తెల్లజుట్టు సమస్యను నివారించడంలో మెంతులు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఇక మూడవది మరియు ఆఖరి పదార్థం కొబ్బరి నూనె. ఇపుడు ఈ మందారం, మెంతులు మరియు కొబ్బరి నూనె ఉపయోగించి ఈ చిట్కా ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక బాండీని తీసుకోండి. ఈ బాండిలో ఒక కప్పు పరిమాణంలో కొబ్బరి నూనె కొద్ది పరిమాణంలో ఎండిన మందార పూలను వేసుకోవాలి, అలాగే దీనికి ఒక టీస్పూన్ పరిమాణంలో మెంతులు కూడా జతపరుచుకోవాలి.


ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై ఉంచి చాలా సన్నని సెగపై సుమారు అయిదు నుండి పది నిమిషాల పాటు ఈ ఆయిల్ ను మరిగించాలి. మరిగిన తరవాత ఈ మిశ్రమంను ఒక బౌల్ లోకి గానీ, సీసా లోకి గానీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ ఇలాంటి కారణాల వల్ల జుట్టు రాలే సమస్యను అధిగమించే అద్భుతమైన హెయిర్ ఆయిల్ తయారు అయింది. ఈ మిశ్రమాన్ని తలకు ఎలాగ అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని మీకు అవకాశం ఉంటే రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకు వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత మీ తలను సున్నితంగా మసాజ్ చేసుకోండి.


ఈ ఆయిల్ ని మీ జుట్టుకి అలాగే రాత్రంతా వదిలేసి, ఉదయాన్నే లేవగానే చల్లని నీటితో ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపు వీలుంటే కుంకుడుకాయ లేదా శీకాయ పొడి చల్లని నీటితో చక్కగా తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారంలో రెండు లేదా మూడు రోజులు రాత్రి ఈ ఆయిల్ ను తలకు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయటం ద్వారా ఏదైతే మీరు చిన్న వయసులో ఏర్పడే హెయిర్ లాస్ సమస్య లేదా తెల్ల జుట్టు సమస్య ఉందో ఆ సమస్య చాలా త్వరితగతిన ఆ సమస్య పరిష్కరింపబడును. అలాగే ఈ ఆయిల్ లో ఉండే పోషకాలు మీ వెంట్రుకల కుదుళ్లకు కావల్సిన పోషణను అందించి వెంటుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ రెట్టింపు చేస్తాయి. అలాగే సాధ్యవంతమైన నల్లటి కురులు మళ్ళీ మీకు వచ్చేందుకు ఈ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: