ఈ రోజు అద్భుతమైన బ్యూటి చిట్కాని తెలుసుకుందాం. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం పొల్యూషన్ నిద్రలేమి ఇలాంటి కారణాల వల్ల వయసు పైబడకుండానే ముఖం పై నల్లటి మచ్చలూ, ముడతలు, వృద్ధాప్య ఛాయలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా. దీనికి ముఖ్య కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం పొల్యూషన్, అలాగే నేటి రోజుల్లో యువతని పట్టి పీడిస్తున్న సమస్య మొటిమలు లేదా మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు.


ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి మళ్లీ మీకు చంద్రబింబం వంటి అందమైన ముఖ సౌందర్యాన్ని తీసుకు వచ్చే అద్భుతమైన హోం రెమెడీ. ఈ చిట్కాని ఎలాగ తయారు చేసుకోవాలో, ఏయే పదార్థాల కావాలో తెలుసుకుందాం. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి కావలసిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం బంగాళదుంప. బంగాళదుంప అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ముఖంపై ఏర్పడే ముడతలు, కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు ఇలాంటి సమస్యల్ని దూరం చేసి అద్భుతమైన, ఆరోగ్యవంతమైన, మృధువైన, సున్నితమైన చర్మాన్ని మనకు తిరిగి తీసుకు రావడంలో అద్భుతమైన ఫలితం అందిస్తుంది.





ఇది చర్మంపై పేరుకు పోయిన మృతకణాలను తొలగించి స్వేదరంధ్రాలను శుభ్రం చేసి చర్మానికి ఒక మంచి టోన్ నివ్వటంలో అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. అలాగే చర్మంపై పేరుకు పోయిన నల్ల ధనాన్ని తొలగించి ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు మరియు గరుకుగా ఉండే మీ ముఖానికి సున్నితత్వాన్ని తీసుకురావటంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప మరియు నిమ్మకాయ ఈ రెండింటినీ వాడి బ్యూటీ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా అద్భుతమైన ముఖ సౌందర్యాన్ని మళ్లీ మనం తిరిగి పొందవచ్చో తెసుకుందాం.


దీనికోసం ముందుగా బంగాళదుంప యెక్కపై లేయర్ ను మనం తీసేసుకోవాలి. బంగాళదుంపలో అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు మరియు అద్భుతమైన స్క్రబ్బింగ్ లక్షణాలున్నాయి. ఇది చర్మంపై ఏర్పడే నల్లదనాన్ని తొలగించి మళ్లీ చర్మానికి మంచి టోన్ ని అందిస్తుంది. అలాగే సున్నితమైన, మృదువైన చర్మం మనకు తిరిగి తీసుకురావటంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. తరువాత బంగాళదుంపను నిలువుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ బంగాళదుంపలను మెత్తగా తురుములా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా మనం బంగాళదుంప రసాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది ప్రాబ్లం అనిపిస్తే బంగళదుంపను మిక్సీ పట్టి దాని రసాన్ని మనం వడకట్టి తీసుకోవచ్చు.


ఇలా బంగాళదుంపను మెత్తగా తురుము లాగా చేసుకున్న తరువాత ఒక బౌల్ తీసుకుని దాని పై ఫిల్టర్ నుంచి మనం తురుమి పెట్టుకొన్న బంగాళదుంపను అందులో వేసుకోవాలి. తరువాత ఇందులో ఉన్న రసాన్ని  ఫిల్టర్ సహాయంతో తీసుకోవాలి. తరువాత బంగాళాదుంప రసానికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలుపుకోవాలి. బంగాళదుంప మరియు నిమ్మరసం ఈ రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడీ మిశ్రం రెడీ అయిపోయింది. దీన్ని ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.


ఒక కాటన్ ని తీసుకుని ఆ మిశ్రమంలో డిప్ చేయాలి. తరువాత దానిని మొఖం మీద వృత్తాకారంలో రాస్తూ అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన బంగాళదుంప మరియు నిమ్మకాయ లో ఉండే గుణాలు చర్మంపై పేరుకు పోయిన మృతకణాలను తొలగించి స్వేద రంధ్రాలు శుభ్రం చేస్తాయి. అలాగే బంగాళదుంపలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మంపై ఏర్పడే నల్లధనం తొలగించి కళ్ల కింద నల్లటి వలయాలు చర్మంపై ఏర్పడే ముడతలను తొలగించి బిగుతైన చర్మాన్ని మీకు మళ్లీ తిరిగి ప్రసాదిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: