సాధార‌ణంగా మనకు వచ్చే రోగాలన్నింటికీ ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కూరగాయలు, ఆకుకూరలే నివారణిగా పనిచేస్తాయంటే అతిశయోక్తి  కాదు. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. అలాగే హైపర్టెన్షన్ (హైబీపీ) వల్ల‌ ఏర్పడే పక్షవాతాన్ని నివారించడంలో పాలకూర బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.


ఈ అధ్యయన వివరాలు 'ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్' అనే మెడికల్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. దానిప్రకారం శాస్త్రవేత్తలు హైబీపి ఉన్న 20,702 మందిపై సర్వే నిర్వహించినట్టు తెలిసింది. హైబీపీని తగ్గించే ఎనాలప్రిల్ అనే మందును వాడుతున్న వారికి మందుతోపాటు ఫోలిక్యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు.
ఫోలిక్యాసిడ్ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో గుండెపోటు వచ్చేందుకు అన్నివిధాల రిస్క్ ఉన్నవారే.


అయినప్పటికీ దీనివల్ల అలా వచ్చే అవకాశాలు 21 శాతం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు త‌గ్గుతాయి. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: