సాధార‌ణంగా బెండ‌కాయ తెలియ‌ని వారుండురూ.. రుచి చూడ‌నివారూ ఉండ‌రు. అన్ని సీజన్లలో బెండ‌కాయ‌లు దొరుకుతాయి. అలాగే వీటితో ఎన్నో రకాల వంటలు చేసుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో ఓ విష‌యం వెళ్ల‌డైంది. ఈ క్ర‌మంలోనే డయాబెటిస్‌ నియంత్రణకు బెండ అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిలో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని తెలిపారు.


బెండను కోసి ఆ ముక్కలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ జ్యూస్‌ను తాగితే మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బెండ రక్తంలోని చక్కెరలను తగ్గించి, వాటి స్థాయిల్లో స్థిరత్వం తీసుకొస్తుందని చెప్పారు. అలాగే టైప్‌ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం వద్ద కొవ్వు కరిగి జీవక్రియ మెరుగుపడుతుందని చెప్పారు. మ‌రియు బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది.


అదే విధంగా బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరంకు అవసరం అయ్యే నీటిని బెండకాయ నుండి గ్రహిస్తుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు మరియు మలబద్దకంను నివారిస్తుంది. బెండకాయలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్ గా తయారుచేయడంలో బెండకాయ గ్రేట్ గా సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: