సాధార‌ణంగా చాక్లెట్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. చాక్లెట్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. వీటిల్లో సగం వాటా అమెరికన్లదే. ఇక 100 గ్రాముల డార్క్ చాక్లెట్ లో 70 నుంచి 80% కోకా ఉంటుంది.  11 గ్రాముల ఫైబర్ తో పాటు మెగ్నీషియం, కాపర్ మాంగనీస్, పొటాషియం, జింక్ వగైరా మూలకాలు ఉంటాయి.  ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో ఆవశ్యకరమైన మూలకాలే కావడం విశేషం. 


అయితే మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీనాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి ఆహారంతో పాటు చాక్లెట్ కూడా డైట్‌లో బాగంగా ఉండాలని వైద్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లావ‌నోల్స్ వ‌ల్ల గుండెకు, మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగవుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్యాన్స‌ర్ ముప్పును కూడా త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది.


డార్క్ చాక్లెట్ పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ మీ ఈశరీర కణాల ఆక్సీకరణకు నష్ట కలిగించే ఫ్రీరాడికల్స్ నుండి ఫ్రీ చేస్తుంది. అయితే చాక్లెట్ తినడం వల్ల దంతాలు పాడైపోతాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. కానీ మనం తినే చాక్లెట్ నోట్లోనే కరిగిపోతుంది కావున అది దంతాలకు హానీ చేసే అస్కారం ఉండదు. అలాగే చాక్లెట్స్‌లో అరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలనే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: