బీపీ(రక్తపోటు) అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్‌ ప్రెషర్‌ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. మానసిక ఒత్తిడులు కూడా బి.పిని ప్రభావితం చేస్తాయి. ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?' అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. 


పొగ పీల్చడం, ఆల్కహాల్ సేవించడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ కూర్చొని పని చేయడం తదితర అలవాట్లు హై బీపీకి దారి తీస్తాయి. అయితే బీపీని కంట్రోల్‌లో ఉంచ‌డం చాలా అవ‌స‌రం. స‌హంజంగా అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పుని తక్కువగా ఉపయోగించాలన్న విషయం తెలిసిందే. బంగాళాదుంపలు పై చర్మంతో పాటు బాగా ఉడికించి చర్మం వలిచి తినడం వల్ల బీపీని నియంత్రించవచ్చు.  దాల్చిన పౌడరును కూరల్లో, వేపుళ్లు, టిఫిన్లలో, కాఫీలో చల్లుకొని వాడటం వల్ల కూడా బి.పి.ని అదుపు చేయొచ్చు.


ప్రతి రోజూ నియమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు, గబగబ నడవటం. గుండె కండరాల సంకోచ, వ్యాకోచాలకు కాల్షియం చాలా అవసరం. తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పచ్చని ఆకుకూరలు, బాదంపప్పులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బీపీని అదుపులో ఉంచుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: