చరిత్రలో నేడు ఎన్నో సంఘటనలు ఎంతో మంది జననాలు  ఇంకెంతో మంది మరణాలు జరిగాయి. అసలు జనవరి 8వ తేదీన చరిత్రలో ఏం జరిగింది ప్రముఖులు ఎవరెవరు జన్మించారు ఎవరెవరు మరణించారు చూద్దాం రండి. 

 

 

 స్టీఫెన్ హాకింగ్ జననం : సుప్రసిద్ధ ఆంగ్లేయ సైదాంతిక  భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఈయన ఏమియోట్రోఫిక్  లేటరల్ స్కెర్లోసిస్  అనే నాడీ మండలానికి చెందిన వ్యాధి  వల్ల క్రమక్రమంగా... అవయవాలన్నీ చచ్చుబడిపోయి  కేవలం  మెదడు మాత్రమే పనిచేస్తుంది. అవయవాలన్నీ చచ్చుబడి పోయినప్పటికీ కూడా ఆయన తన మైండ్ తోనే గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్. ఈయన అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అనే అవార్డును అందుకున్నారు. కనీసం కదలడానికి సహకరించిన శరీరంతో...  చక్రాల కుర్చికి అతుక్కుపోయిన ఒక మనిషి... తాను కనీసం మాట్లాడడానికి కంప్యూటర్ సహాయం తీసుకొని ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపారు స్టీఫెన్  హాకింగ్. ఒక శాస్త్రవేత్త గానే కాకుండా ఆయన మీద ఆయనకున్న నమ్మకం తో విధి వంచించినప్పటికీ    తనను తాను  అనుకూలంగా మార్చుకునే తత్వం స్టీఫెన్ హాకింగ్ ది . నేటి తరం యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఎన్నో ఖగోళ శాస్త్ర   ప్రశ్నలకు కేవలం ఆయన చూపులతోనే కంప్యూటర్ ద్వారా సమాధానాలు కనుగొన్నారు స్టీఫెన్ హాకింగ్.. ఈయన 1942 జనవరి 8వ తేదీన జన్మించి... 2018 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు. 

 

 

 నందమూరి తారకరత్న జననం : నందమూరి వంశం నుంచి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు నందమూరి తారకరత్న. తారకరత్న  జనవరి 8 1983 సంవత్సరంలో జన్మించారు. ఇక నందమూరి తారకరత్న మొదట్లో వరుస సినిమాలతో  దూసుకుపోయారు. ఇక శ్రీ రాముడు పాత్రలు  వేయడంలో తారకరత్నకు మంచి ప్రతిభ ఉంది. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాడు నందమూరి తారకరత్న. ఎన్నో  విభిన్న మైన కథలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమయ్యాడు. ఇక నటనకు పెట్టింది పేరుగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నందమూరి తారకరత్న. ప్రస్తుతం నందమూరి తారక రత్న కు అవకాశాలు తగ్గిపోవడంతో తెరమీద కనిపించి చాలా రోజులు అవుతుంది. 

 

 

 తరుణ్ జననం : మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు తరుణ్...  తరువాత హీరోగా మారి ఎన్నో సినిమాల్లో నటించారు. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు హీరో తరుణ్. 1983 జనవరి 8వ తేదీన తరుణ్ హైదరాబాద్లో జన్మించారు. ఎన్నో ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకున్నారు. ఎన్నో  ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించి  ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ మొదట్లో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోలేక పోయారు. దీంతో తరుణ్ కి అవకాశాలు తగ్గాయి. దీంతో తెలుగు తెరపై హీరోగా కనుమరుగైపోయారు తరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: