మార్చి 10వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు... ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు..ఎన్నో ముఖ్య సంగటనలు  జరిగాయి. మరి నేడు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 మొదటి టెలిఫోన్ కాల్ : 1876 మార్చి 10వ తేదీన అలెగ్జాండర్ గ్రహంబెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు. 

 

 మహాత్మా గాంధీ అరెస్ట్ : 1922 మార్చి 10వ తేదీన స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ రాజ ద్రోహం కింద అరెస్టయ్యారు. 

 

 స్వర్ణలత జననం : పాతకాలపు తెలుగు సినిమా గాయని అయినా స్వర్ణలత 1928 మార్చి 10వ తేదీన జన్మించారు. ఈమె  1950 నుంచి 1970 మధ్య కాలంలో ఎక్కువగా హాస్య భరితమైన గీతాలు పాడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా పాటలు పాడారు స్వర్ణలత. ఈమె  అసలు పేరు మహాలక్ష్మి.

 

 మాధవరావు సింధియా జననం : కేంద్ర మాజీ మంత్రి అయిన మాధవరావు సింధియా 1945 మార్చి 10వ తేదీన జన్మించారు. అయినా దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎన్నో పదవులను అలంకరించారు. 

 

 పి కేశవరెడ్డి జననం : ప్రముఖ తెలుగు నవలా రచయిత అయిన డాక్టర్ పి కేశవరెడ్డి 1946 మార్చి 10వ తేదీన జన్మించారు. పీ కేశవారెడ్డి రాసిన ఎనిమిది నవలలో ఎంతగానో పాఠకుల ఆదరణ పొందాయి. ఈయన  రాసిన నవలలు హిందీలోకి కూడా తర్జుమా చేయబడ్డాయి. ఇక ఈయన రాసిన నవలలో ఇంగ్లీషులో కూడా ప్రముఖ ఆక్స్ ఫర్డ్  వంటి సంస్థలు కూడా ప్రచురించాయి. ఎన్నో నవలలను  రాసి ప్రచురించారు. నేను రాసిన నవలలు అన్నీ ఎక్కువ గా ప్రేక్షకాదరణ పొందుతుంది. 

 

 మత్స సంతోషి జననం: భారతీయ వెయిట్ లిఫ్టర్ అయినా మత్స సంతోషి.. 1994 మార్చి 10వ తేదీన జన్మించారు. ఈమె  కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో  యాభై మూడు కిలోల విభాగంలో భారత్ కు  కాంస్య పతకాన్ని సాధించారు. ఈమె  విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో జన్మించారు. 

 

 రీతు వర్మ జనం : తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోయిన్ రీతూ వర్మ పెళ్లిచూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ముందుగా ఎన్నో లఘు చిత్రాల్లో నటించిన రీతు వర్మ పెళ్లి చూపులు సినిమా లో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈ సినిమాలో రీతు వర్మ తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు.రీతూ వర్మ  1990 మార్చి 10వ తేదీన జన్మించారు. హైదరాబాద్ లో జన్మించిన ఈ అమ్మడు... చదువు మొత్తం హైదరాబాద్లోని పూర్తిచేసింది. ఇక అనుకోకుండా అనే  లఘుచిత్రంలో బెస్ట్ షార్ట్ ఫిలిం అనే అవార్డు కూడా దక్కించుకుంది, ఇక పెళ్లి చూపులు సినిమా లో బెస్ట్ యాక్టర్ గా కూడా అవార్డు దక్కించుకుంది రీతువర్మ. ప్రస్తుతం వివిధ సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుని  నటిస్తోంది.. 

 

 సావిత్రిబాయి పూలే మరణం : తొలితరం ఉపాధ్యాయురాలు అయినా సావిత్రిబాయి పూలే 1897 మార్చి 10వ తేదీన స్వర్గస్తులయ్యారు. ఈమె అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. ఒక సంఘసంస్కర్త గా మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు సావిత్రిబాయి పూలే. ఇప్పటికే భారత ప్రజలు అందరూ సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటారు. 

 

 కోగంటి విజయలక్ష్మి మరణం : ప్రముఖ నవలా రచయిత్రి అయిన కోగంటి విజయలక్ష్మి 2016 మార్చి 10వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: