జూన్ 15వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకెంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరీ ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 ద్వారం భావనారాయణ రావు జననం  : వైలెన్ విధ్వాంసుడు ద్వారం భావ నారాయణ రావు 1984 జూన్ 15వ తేదీన జన్మించారు. ఈయన  ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. ఈయన  విజయవాడలోని సంగీత కళాశాలలో సంగీత టీచర్ గా పని చేశారు. ఈయన సంగీతంలో ఎంతో  ప్రేరణను ఇచ్చే విదంగా సంగీతంలో ప్రతిభ చాటారు. 2000 జూలై 24వ తేదీన మరణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీత కళాప్రపూర్ణ అనే పురస్కారాన్ని కూడా అందుకున్నారు వారం భావనారాయణ రావు. 

 

 చక్రి జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు రచయిత గాయకుడు నటుడుఅయిన చక్రధర్ తెలుగు ప్రేక్షకులందరికీ చక్రి  గా సుపరిచితుడు. ఈయన 1974 జూన్ 15వ తేదీన వరంగల్ జిల్లాలో జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగీత దర్శకులలో ఒకరు చక్రి. ముఖ్యంగా సంగీతం అందించిన ఈ సినిమాలో ఇడియట్,  అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సత్యం లాంటి సినిమాలకి  సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. తెలుగులోనే కాక తమిళం కన్నడంలో కూడా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు సంగీతదర్శకుడు చక్రి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ స్వయంకృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపించి ఆదర్శంగా నిలిచారు.సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోడానికి ఎంతో కష్టపడ్డాడు చక్రి. ఎన్నో  ప్రైవేట్ ఆల్బమ్స్  చేసిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలో అవకాశం వచ్చింది చక్రికి.  తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో నంది అవార్డులను సైతం అందుకున్నారు చక్రి. 

 

 కొరటాల శివ జననం  :  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు స్క్రిప్ట్ రైటర్ అయినా కొరటాలశివ 1975 జూన్ 15వ తేదీన జన్మించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్ర పరిశ్రమపై ఆసక్తితో.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్గా చేరారు . ఆ తర్వాత కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేశారు. 2013లో మిర్చి సినిమాతో చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆతర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న ఓటమి ఎరుగని దర్శకుడు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. 

 

 శ్రీ శ్రీ మరణం : తెలుగు జాతి గర్వించదగ్గ మహా కవి... తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన  మహోన్నత వ్యక్తి శ్రీ శ్రీ 1983 జూన్ 15 వ తేదీన మరణించారు. శ్రీ శ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఎన్నో సినిమా పాటల రచయితగా ఎంతగానో ప్రసిద్ధి చెందాడు శ్రీశ్రీ . ఇక ఈయన రచించిన ఎన్నో రచనలు తెలుగు ప్రజలందరిలో  ఎంతో ఉత్తేజం నింపాయి అని  చెప్పాలి. ముఖ్యంగా యువతలో సరి కొత్త ఉత్తేజాన్ని నింపుతూ ఉంటాయి శ్రీ శ్రీ రచనలు.

మరింత సమాచారం తెలుసుకోండి: