దేవుడు ఉన్నాడు అని మన భారత దేశం ఇతర దేశాలకు ప్రూఫ్స్‌తో సహా చూపించినా కూడా వారు ఏదో ఒక కారణం చెప్పి ఆ నమ్మకాన్ని తప్పుబట్టిస్తారు. అయితే వారు నమ్మనంత మాత్రాన మన నమ్మకం గుడ్డిదైపోదు. అయితే వారికే మన దేవుడు కనిపిస్తే... అప్పుడైనా వారు నమ్ముతారా అనే ప్రశ్న వస్తోంది. అయితే నార్వేలో వినాయకుడు పుట్టాడు. నార్వేలో వినాయకుడు పుట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమండి.. అచ్చం వినాయకుడి మాదిరిగా ఉండే ఒక బేబి నార్వేలో జన్మించాడు. ఏనుగు మనిషి రూపంలో ఉన్న ఆ బేబి రోజు రోజుకి ఆకారంలో కూడా మార్పు కనిపిస్తుంది. రోజు రోజుకి భారీగా తయారవుతుంది.
అయితే మనకు వినాయకుడంటే ఎక్కడాలేని భక్తి. దీంతో నార్వేలో ఉన్న హిందువులు చాలా మంది ఒక్కసారైనా ఆ ఎలిఫెంట్ బేబిని చూడాలని తహతహలాడుతున్నారట. ఇక ఆ బేబి పుట్టుకకి సంబంధించిన చరిత్ర చూస్తే అలెగ్జాండర్, లోలాయాండ్రొసన్ అనే దంపతులకు ఒక వింతైన ఆకారంలో ఒక బాబు జన్మించాడు. మొదట్లో ఆ ఆకారం చూసి భయపడ్డా కూడా తర్వాత వాళ్ళు ధైర్యం చేసి ఆ బాబుని వదిలిపెట్టుకోలేక ఇంటికి తీసుకువెళ్ళారు. సగం మనిషి, సగం ఏనుగు రూపంలో ఉండడంతో పాటు కాళ్ళూ, చేతులు కూడా సరిగా ఏర్పడలేదు. కాని రోజు రోజుకి ఆ బాబు పెరుగుతుండడంతో తమ బెడ్ రూం నుండి బేస్మెంట్లోని గదికి షిప్ట్ చేశారు. ఆ బేబిని చాలా రహస్యంగా దాచిపెట్టారు. ఆ బేబిని బయట ప్రపంచానికి చూపించలేదు. అయితే వారి స్నేహితుల ద్వారా ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ తర్వాత వారి అడ్రస్ కూడా బయటకు తెలియడంతో అసలు కథ మొదలయింది. వినాయకుడే మళ్ళీ పుట్టాడని హిందువులు ఏకంగా ఆ ఇంటికి యాత్లు మొదలు పెట్టారు.
మొదట్లో హిందువుల గురించి తెలియక ఒకరిద్దరికి చూపించారు. రాను రాను అది ఎక్కువై పూజలు చేయడంతో అలెగ్జాండర్ దంపతులు చిరాకు పడడం మొదలు పెట్టారు. మా బేబిని వదిలేయండి మేం ఒక జీవిలా చూస్తున్నాం కాని బిడ్డలా చూడడం లేదు అన్నారు. ప్రాణం ఉంది కాబట్టి మమకారంగా పెంచుకుంటున్నాం దయచేసి మా ఇంటికి రావద్దంటూ వేడుకుంటున్నారు. వాళ్ళు కావాలంటే మా బాబుని ఇండియాకు అమ్మేస్తాం దయచేసి డిస్ట్రబ్ చెయ్యొద్దు అంటున్నారు. అయితే జన్యూ లోపం వల్ల అలా పుట్టాడని వైధ్యులు నిర్ధారించారు. అయితే మన దేవుడు వారికి భారం కావొచ్చు కాని మనకు గట్టి నమ్మకం అంటున్నారు.