సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. సెల‌బ్రెటీలు గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.  


గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ 
ప్ర‌తి వారం ఒక సెల‌బ్రెటీ గ‌త జ‌న్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా సినీ న‌టి, ఎమ్మెల్యే రోజా పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. రోజా గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.


మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించిన రోజా
గ‌త‌ జ‌న్మ‌లో రోజా మ‌హారాష్ట్ర ప్రాంతంలో జ‌న్మించింద‌ని ఎస్వీ నాగ్‌నాథ్ తెలిపారు. రాజుల వంశంలో జ‌న్మించిన రోజా యువ‌రాణిగా అద్భుత రూపం ఆమె సొంత‌మ‌ని చెప్పారు. కొండ‌, న‌దీ ప్రాంతాల్లో ఆమె జ‌న్మ గ‌డిచిందని, ప్ర‌కృతిబ‌ద్ధంగా పూర్తి స్వేచ్ఛ‌తో ఆమె జీవించింద‌ని నాగ్‌నాథ్ తెలిపారు. సెన్సిటివ్ మ‌న‌స్త‌త్వం ఉన్న రోజా ఆ జ‌న్మ‌లో సెన్సేష‌న‌ల్ సృష్టించింద‌ట‌. ఆ జ‌న్మ‌లో రోజా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండేదో కూడా నాగ్‌నాథ్ తెలిపారు. త‌న‌కంటే వ‌య‌సులో చిన్న వ్య‌క్తిని రోజా పెళ్లాడింద‌ట‌. పెళ్ల‌యినా ప‌న్నెండేళ్ల దాక సంతానం లేద‌ట‌. భ‌ర్త‌కు క‌ళ్లు పోయి అంధుడైన‌ట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంద‌ట‌. అప్ప‌టి ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల ఆమె లైఫ్‌లో ఊహించ‌ని అనేక ప‌రిణామాలు జ‌రిగిన‌ట్టు నాగ్‌నాథ్ తెలిపారు. 


నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్ర‌సార‌మైన రోజా పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారుతోంది.


వైర‌ల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన రోజా పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.

Video Link


మరింత సమాచారం తెలుసుకోండి: