సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో, విశ్వంలొ అన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయంటారు సైంటిస్టులు.
వాటిలో ఒక నక్షత్ర మండలానికి చెందిన అనేక సౌర కుటుంబాలలో ఒక సూర్య కుటుంబానికి చెందిన 9 గ్రహాలలో భూమి అనే ఒక గ్రహం మీద మనం బతుకుతున్నాం అంటే మన జీవితం ఎంత క్షణికం..? 

సృష్టి, స్థితి,లయం నిరంతర పరిణామం, ఈ పరిణామాల కాలంతో పోలిస్తే ఇక్కడ మనం జీవించే కాలం లిప్తపాటు మాత్రమే. అద్బుతమైన, ఈ మానవ జీవితానికి పరమార్ధం, జీవితాన్ని వీలైనంత వరకు అర్దవంతంగా జీవించడమే, మనం బతికే, చివరి క్షణం వరకు జీవితం ఓ వేడుకగా సాగాలి. 
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో జ్ఞానులు మానవ జీవితాన్ని సుసంపన్నం చేయడానికి, ఆనందమయం చేయడానికి ఎన్నో మార్గాలను శోధించి మనకు అందించారు. అలాంటి ఆహార,విహార,విజ్ణానాన్ని క్లుప్తంగా, సులభంగా ఆచరణకు అనువుగా అందించే ప్రయత్నమిది. ఈ విధానాలను అచరించి ప్రతి ఒక్కరు సంపూర్ణ అరోగ్యాన్నిపొంది తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.

 
ఈ జీవితం ఎంతో గొప్పది, మళ్ళీ, మళ్ళీ రాని ఓకే ఒక్క అపూర్వ అవకాశం. గడుస్తున్న ప్రతి రోజు, జీవితపు దూరం తగ్గిస్తుంది.నిన్న రాత్రి ప్రపంచంలో మనతో పాటు నిద్రించిన వారిలో కొందరు ఈ రోజు లేరు,కానీ మనం ఉన్నామంటే మనకీ రోజు బోనస్‌ వంటి అద్భుత వరం. జీవించడమనే వరం ఎంత విలువైనదో, తెలియాలి అంటే ఒకసారి ఆసుపత్రి వద్దకు వెళ్ళండి. అక్కడి రోగుల దైన్యమైన చూపులు చూడండి? కనీసం ఒక్క రోజైనా బ్రతికించమని వైద్యులను ప్రాధేయ పడే వారిని చూడండి? ప్రాణాలతో వుండి ఆచేతనావస్తలో ఉన్న అభాగ్యులను చూడండి?జీవితం విలువ తెలియాలంటే జీవితపు చివరి రోజు వరకు వేచివుండవద్దు , అప్పుడు తెలిసినా ఉపయోగంలేదు.

ఇప్పుడే జీవితాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దుకుందాం రండి.మీలో గొప్పశక్తి… ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి వుంది .మీరు మీ కుటుంబానికో ,మీ ఊరికో, దేశానికో ఓ మార్గదర్శకం కాగలరు, మీ జీవితం విలువను తెలుసుకునే కొద్దీ మీ హద్దులు చెరిగిపొతాయి. మీరు విశ్వమానవులవుతారు . అప్పుడు మీరు, మీచుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనందమయంగా మార్చుతారు.అందమైన జీవితానికి పునాది ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా,ఆద్యాత్మికంగా ఆరోగ్యంగా వుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. అలా ఉంటేనే ,మనం ఏదైనా సాధించగలం.


మరింత సమాచారం తెలుసుకోండి: