కావాల్సిన ప‌దార్థాలు: 
అటుకులు- 2కప్పులు
కొబ్బరిపాలు- కప్పు
ఎండుమిర్చి- ఐదు
నిమ్మకాయ-1


ఉప్పు- రుచికి తగినంత
ఉల్లిపాయ- ఒకటి
పోపు దినుసులు- తగినన్ని
పచ్చిమిర్చి- ఐదు


వేరుసెనగలు- మూడుచెంచాలు
కరివేపాకు- నాలుగురెబ్బలు
నూనె- నాలుగు చెంచాలు


తయారీ విధానం: 
ముందుగా అటుకుల్ని కొబ్బరిపాలలో పదినిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, వేరుసెనగలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. 


అవి బాగా మగ్గాక నానిన అటుకులు తగినంత ఉప్పు చేర్చి కలియతిప్పి దింపేసి స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేరే పళ్ళెంలోకి తీసుకొని నిమ్మరసం పిండి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన అటుకుల పులిహోర‌` రెడీ..

అటుకులను ఇష్టపడని వారు చాలా అరుదు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అటుకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. సో.. విడిగా అటుకుల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా అటుకుల పులిహోర చేసుకొని తింటే స‌రిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: