సాధార‌ణంగా ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో జీవితాంతం రొమాంటిక్‌గా.. హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటికాలంలో భార్యాభర్తల మధ్య ఆ ఆసక్తి తగ్గుతోంది. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సమస్యలు లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి. కానీ.. శృంగారం ఆరోగ్యకరమైనది. శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. అయితే సెక్స్ విషయంలో ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని పదార్థాలు సెక్స్ కోరికలు పెంచితే.. మరికొన్ని మాత్రం శృంగారంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి..


మద్యపానం, ధూమపానం వల్ల సెక్స్‌ను ఎక్కువ సేపు ఎంజాయ్ చేయలేరు. వీటి వల్ల మనసు, శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.  పాల ఉత్పత్తులు తింటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. సెక్స్‌కు ముందు వీటిని తినొద్దంటున్నారు. ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అందుకు సెక్స్‌కు ముందు ఓట్స్ తీసుకోవద్దు. సెక్స్‌కు ముందు చూయింగ్ గమ్ తినకూడదు. అందులో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. క్యాబేజీలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండడంతో క్యాబేజీ సెక్స్ కోరికలను అణచివేస్తుంది.


జీర్ణం కావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. వీటిని తిన్నాక సెక్స్‌ చేస్తే జీర్ణాశయంపై ప్రభావం చూపి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. అలాగే ఉల్లి పాయలతో శృంగారం సామర్థ్యం పెరిగినప్పటికీ సెక్స్ ముందుకు వాటికి దూరంగా ఉండాలి. నోటి దుర్వాసన వస్తే సెక్స్‌ను ఎంజాయ్ చేయలేరు. కడుపునిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి. తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. అదే విధంగాఅనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువ శాతం జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: