సమాజంలో ఉన్న కొన్ని కొన్ని ఆచారాల వల్ల ఆడవాళ్లకు కలిగే బాధలు, వీరు పడే అవమానాలకు అంతే ఉండదు. ఒక్కోసారి ఆడపిల్లగా ఎందుకు పుట్టాంరా బాబు అంటూ బాధపడే పరిస్దితులు ఎదురవుతాయి. ఆడపిల్లగా జన్మ ఎత్తింది మొదలు బామ్మగా, అమ్మమ్మగా తనువు చాలించే వరకు ప్రతి దశలోను వీరు పడే కష్టాలు వర్ణానితం. ఇదే కాకుండా ఆనందంగా పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టాక కూడా కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి.


ఇక కట్టుకున్న వాడైన అర్ధం చేసుకుంటాడనుకుంటే ఆ అదృష్టం కొంత మందికే దక్కుతుంది. అందరికి ఆ భాగ్యం ఉండదు. ఇకపోతే పెళ్లి నాటి తొలిరాత్రిలో చాలా మందికి తన భార్య వర్జీన్ అవునో కాదో అనే అనుమానాలు వస్తుంటాయి. ఇందుకు గాను ఆడపిల్లకు శృంగారంలో  పాల్గొన్నప్పుడు బ్లడ్ వస్తేనే కన్య అని కొందరు భావిస్తారు. ఇది ఎంత పెద్ద మూఢాచారమంటే బుద్ధిలేని వారు. అజ్ఞానంలో బ్రతుకుతున్న వారు ఇలా ఆలోచిస్తారు.


కాని ఇలాంటి అవివేకుల కోసం అమెజాన్ సంస్ద ఒక కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్‌ ఉత్పత్తి చాలా విచిత్రం, వింతగా ఉంది.. ఇకపోతే ఆన్‌లైన్ మార్కెట్‌లో  కొన్ని ఎబ్బెట్టు కలిగించే ‘అడల్ట్’ వస్తువులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ‘అమెజాన్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రొడక్ట్ గురించి తెలిస్తే తప్పకుండా ముక్కున వేలు వేసుకుంటారు. ఎందుకంటే.. ఇది అలాంటి ఇలాంటి ప్రొడక్ట్ కాదు, ఫేక్ వర్జినీటీ కోసం వాడే ఉత్పత్తి.


అదేమంటే మధ్యతరగతి కుటుంబాల్లో కన్యత్వాన్ని చాలా సీరియస్‌గా భావిస్తారు. ఒక వేళ ఆ యువతి అత్యాచారానికి గురైతే.. ఆమె ‘కన్యత్వం’ పోయిందని బాధపడతారు. నేరం ఆమెదే అన్నట్లుగా భావిస్తారు. రోజులు మారుతున్నా.. ప్రజల్లో ఈ ఆలోచనలు మాత్రం మారడం లేదు. ఈ సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో అమేజాన్ ఈ ఐ-వర్జిన్ - బ్లడ్ ఫర్ ది ఫస్ట్ నైట్ అనే ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో ఉంచింది.


ఇందులో నాణ్యమైన బ్లడ్ పవర్ ఉంటుందని, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని పేర్కొంది. దీన్ని తొలిరాత్రిలో వాడితే  ‘ఫేక్ బ్లడ్’ కారుతుందని తెలిపింది. ఇకపోతే రక్తం కారితేనే కన్య అని భావించేవారి మైండ్ సెట్ మార్చడం కంటే ఈ ఉత్పత్తి వాడటమే బెటర్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 


ఇలాంటి ఉత్పత్తిని అమ్మడమంటే సమాజంలో రక్తం కారితేనే కన్య అనే విషయాన్ని బలపరిచినట్లవుతుంది అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైన  ప్రజలు, విద్యావంతులు ఇంకా అనాగరికంగానే బ్రతుకుతున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. వివాహం అనేది నమ్మకంతో జరగాలి. అంతే కాని అనుమానాంతో ఏర్పడే బందాలు ఎక్కువ కాలం నిలవవు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: