ఇటలీలోని ఒక పెద్ద డ్రగ్ మాఫియా కు అడవి పందులు భారీ షాక్ ఇచ్చాయి. వాళ్లు అడవిలో దాచిన కొన్ని లక్షల రూపాయల విలువైన కొకెయిన్ మాదకద్రవ్యాల ప్యాకెట్లను ఈ పందులు చించేసి వాటిని మొత్తం తినేశాయి. దీంతో ఇటలీలోని నైట్ క్లబ్బుల్లో కొకెయిన్ ని సరఫరా చేసే వీళ్ళు ఈ అడవి పందుల వల్ల దొరికిపోయారు. 


ఎలాగంటే ..... కొన్ని నెలల క్రితం ఒక డ్రగ్ డీలర్ దారుణ హత్యకు గురైయ్యాడు. దీంతో ఇటలీ పోలీసులుకు తమ దేశంలో డ్రగ్స్ సరఫరా యదేచ్ఛగా జరుగుతుందని తెలిసింది. ఆ రోజు నుంచి డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అందరి క్రిమినల్ ఫోన్ నెంబర్స్ పైన నిఘా పెట్టారు. అయితే ఒకానొక రోజు కొంతమంది క్రిమినల్స్ ఫోన్లో పందుల్ని తిట్టడం వీరికి వినిపించింది. అడవిలోని ఏ ఏ ప్రదేశాల్లో తాము దాచుకున్న కొకెయిన్ ని పందులు తినేసాయో అవన్నీ ఫోన్ లో మాట్లాడటం వలన పోలీసులు ఈ విషయం తెలిసింది. 


దీంతో పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా ముగ్గురు అల్బానియాన్లను ఒక ఇటలీ డ్రగ్ డీలర్ ను పట్టుకున్నారు. ఎంతో పెద్ద డ్రగ్ ముఠా అయినా వీళ్ళు చివరికి పందుల వల్ల దొరికిపోవడం హాస్యాస్పదం.


ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని తిన్న జంతువులలో పందులేం మొదటి కావు. 1980లో అమెరికాకి చెందిన ఒక నల్ల ఎలుగుబంటి అడివిలో దొరికిన 40 కేజీల కొకెయిన్ తిన్నది. కానీ కొకెయిన్ ఓవర్ డోస్ అవ్వడంతో అది తిన్నా ఎలుగుబంటి కొన్ని నిమిషాల్లోనే చనిపోయింది. ఆ 40 కిలోల కొకెయిన్ ని ఒక డ్రగ్స్ డీలర్ హెలికాప్టర్ నుంచి పడేసాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: