తెలుగు రాష్ట్రాల్లో టీ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే అది వారి జీవనశైలిలో అంతర్భాగం. కాస్త తలనొప్పి వచ్చినా.. నీరసంగా అనిపించినా కప్పులో కాస్త టీ పడాల్సిందే. అయితే చామంతి పూలతోనూ టీ చేయొచ్చని, అది గ్రీన్ టీ కంటే ఎన్నో రకాలుగా మెరుగైనదని మీకు తెలుసా?  అవును..! చామంతి పూల నుంచి తీసిన కొన్ని ప‌దార్థాల‌తో త‌యారు చేసే పొడితో టీ పొడి త‌యారు చేస్తారు. అది అచ్చం సాధార‌ణ టీ పొడిని పోలి ఉంటుంది. అయితే చామంతి టీలో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. మిగిలిన టీల మాదిరిగా దీనిలో కెఫీన్ ఉండదు.

 

దీనిలో ఉన్న చామాజ్యులెన్ అనే రసాయనం బాధ నివారిణిగా పనిచేస్తుంది. చామంతి పూలతో తయారు చేసే టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల కళ్లకింద వాపు, నల్లని వలయాలు ఏర్పడితే చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటిమీది ఒత్తిడీ దూరమవుతుంది.

 

భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భరించలేని తలనొప్పి వేధిస్తుంటే..ఓ కప్పు చామంతి టీ తాగితే తలనొప్పి తగ్గటమే గాక ఒత్తిడి ఎగిరిపోతుంది.  డయాబెటిస్ ఉన్న వారికి కూడా చామంతి పూల టీ మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. చామంతి టీ ఉత్పత్తుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే డామేజ్ నుంచి రక్షిస్తాయి.ఇది కణాలు,కణజాలాలని తిరిగి ఏర్పడేలా చేస్తుంది. సో.. ఖ‌చ్చితంగా ఈ `టీ`ని మీ డైట్‌లో చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: