మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లోనూ అన్నం ప్ర‌ధాన ఆహారాల్లో భాగంగా ఉంది. మ‌న ద‌క్షిణ భార‌త‌దేశంలోనైతే ఇదే ముఖ్య‌మైన ఆహారం. చౌక‌గా బియ్యం ల‌భించ‌డం, ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో మ‌న ద‌గ్గ‌ర అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు. ఇక రాత్రిపూట మిగిలిపోయిన అన్నంను చద్దన్నం అని పిలుస్తారు. ఇలా చద్దన్నంను ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉదయంపూట తీసుకుంటారు. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారట. 

 

అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చద్దన్నంను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరం లైట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అయితే చ‌ద్ద‌న్నం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ చ‌ద్ద‌న్నంను వేడి చేసి తిన‌డం మంచిది కాదు. కష్టపడి సంపాదించిన అన్నాన్ని పారేస్తామా.. వేడి చేసుకొని తింటే సరి’ అనే మాటలు రెగ్యులర్​గా మనకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ అన్నం వేడి చేస్తే విషపూరితంగా మారుతుందని స్టడీస్​ చెప్తున్నాయి. 

 

చాలా రకాల ఆహార పదార్థాలు, వంటకాలు ఒకరోజు గడిచిన తర్వాత బ్యాక్టీరియాలకు నివాసాలుగా మారతాయి. ఇవి కొన్ని రకాల టాక్సిన్లను విడుదల చేస్తుంటాయి. అయితే అన్నాన్ని వేడి చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా  విడుదల చేసే టాక్సిన్ల వల్ల వాంతులు, డయేరియా వంటి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఒకవేళ అన్నాన్ని మైక్రో ఒవెన్​లో, రైస్​ కుక్కర్​లో మళ్లీ వేడి చేయాలనుకుంటే.. కాసిన్ని నీళ్లు లేదా నూనె లేదా బటర్​మిల్క్​ పోసి వేడిచేయండి. ఇలా చేస్తే.. అన్నం వేడి చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఉండిపోయిన బ్యాక్టీరియా వల్ల సమస్యలు ఉండ‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: