కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగంలో అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు . వాస్త‌వానికి మన పూర్వీకులు ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారు. దీనికి ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉంది. ఇక‌ కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా ఉంటుంది. కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. త‌మ బిడ్డ‌లు అందంగా పుట్ట‌డానికి కుంకుమ పువ్వును పాల‌ల్లో వేసుకొని తాగుతుంటారు.

 

అయితే కుంకుమ పువ్వును పాల‌లో క‌లుపుకుని తాగితే నిజంగానే బిడ్డ అందంగా పుడ‌తారా..? అన్న ప్ర‌శ్న వ‌చ్చే ఉంటుంది. ఈ విష‌యంపై కొంద‌రు సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు కూడా చేశారు. వాటిలో తేలిందేమిటంటే, కుంకుమ పువ్వుకు, పుట్ట‌బోయే బిడ్డ అందానికి సంబంధం లేద‌ని తెలిసింది. కాక‌పోతే కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్తం శుద్ధి అవుతుందట‌. మ‌రియు గ‌ర్భ‌వ‌తి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే బిడ్డ అందం గురించి కాక‌పోయినా, కుంకుమ పువ్వును గ‌ర్భిణీలు రోజూ తిన‌డం వ‌ల్ల శిశువుకు ఆరోగ్యప‌రంగా మంచిదంటున్నారు నిపుణులు.

 

ఇక కుంకుమ పువ్వు కేవ‌లం గ‌ర్భిణీల‌కు మాత్ర‌మే కాదు.. ఎవ‌రు తాగినా ఆరోగ్య‌క‌ర‌మే. పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. కుంకుమ పువ్వులో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. అదే విధంగా, కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్స్ మరియు మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక జబ్బు నుండి మన శరీరాన్ని కాపాడ‌తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: