ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో బిజీ షెడ్యూళ్ళతో ప్రతి ఒక్కరూ ఎంతగానో నలిగిపోతున్నారు. చాలామంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధచూపుతున్నారు. ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. అయితే శరీర బరువును తగ్గించే అత్యుత్తమమైన పానీయాలలో గ్రీన్-టీ ఒకటి, దానిని ప్రపంచంలోనే చాలామంది ప్రజల చేత వినియోగించబడుతుంది. బరువు తగ్గించడం నుండి క్యాన్సర్ నివారణ వర‌కూ వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఈ గ్రీన్ టీలో ఉన్నాయి. అయితే గ్రీన్ టీ దాదాపుగా అందరికీ మేలు చేసినా పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తాగకూడదు. 

 

గ్రీన్ టీలో ఎక్కువగా ఉండే కెఫీన్ మైగ్రేన్ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు. అందుకని మైగ్రేన్ ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండ‌డం చాలా మంచిది. మ‌రియు ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నవారు గ్రీన్ టీని తాగకూడదు. ఎందుకంటే మన శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా గ్రీన్ టీ అడ్డు పడుతుంది. కనుక ఆ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తాగకపోవడమే మంచిది. డయాబెటిస్తో బాధపడుతున్న ప్రజలు గ్రీన్-టీని వినియోగించడం మానివేయాలి, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో జోక్యం చేసుకోవచ్చు. 

 

నిద్రలేమి, ఆందోళన, కంగారు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. లేదంటే ఆయా సమస్యలు మరింత ఎక్కువవుతాయి. గర్భం ప్రారంభం దశలో కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అటువంటి కెఫిన్ పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒక్కటి . కెఫిన్ ఉన్న గ్రీన్ టీ త్రాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. పెప్టిక్ అల్సర్, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తాగరాదు. తాగితే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: