మొబైల్ గేమ్స్ లో అత్యంత పాపులర్ గేమ్ పబ్జి. అత్యంత రసవత్తరంగా సాగే ఈ గేమ్ కు ఒక్కసారి అలవాటు పడితే జీవితం నాశనం అయ్యినట్లే. ఇప్పటికే చాలా మంది టీనేజ్ పిల్లలు తమ తల్లిదండ్రులు పబ్జి ఆడనివ్వట్లేదని ఇంట్లోనుంచి పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, హత్య చేయడం... ఇంకా బాహ్య ప్రపంచం గురించి పట్టించుకోకుండా సుదీర్ఘ సమయం పబ్జి ఆడి చనిపోవడం జరిగింది. తాజాగా మళ్ళీ అటువంటి దుర్ఘటన జరిగి అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది.


వివరాల్లోకి వెళితే... గ్వాలియర్‌లోని చంద్రబాలి నకా ఝాన్సీ రోడ్‌కు చెందిన సౌరభ్(20) అనే వ్యక్తి తన ఫ్రెండ్ సంతోష్ తో కలిసి రాజధాని నగరం ఢిల్లీ కి ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. తనతో పాటు కెమికల్ వాటర్ బాటిల్స్ ని కలిగి ఉన్న ఒక బ్యాగ్ ను తెచ్చుకుంటున్నాడు. అయితే.. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఇద్దరూ పబ్జి గేమ్ ఆడటం ప్రారంభించారు. వాళ్లు ఆడుతున్న మ్యాచ్ లో తక్కువ ఎనిమీస్ మిగిలివుండటంతో... ఇద్దరూ వారి ఆటపైనే మరింత ఏకాగ్రత పెట్టారు. ఆ సమయంలో సౌరభ్ కి దాహం వేసింది.. వాటర్ బాటిల్ కోసం తాను తెచ్చుకున్న బ్యాగ్ లో ఒక చెయ్యి పెట్టి, మరొక చేత్తో మొబైల్ పట్టుకొని తన పబ్జి మ్యాచ్ ని చూస్తున్నాడు. చేతికి బాటిల్ దొరికింది, దాని మూత తీసి తాగాడు. అప్పుడు తెలిసింది తాను తీసింది వాటర్ బాటిల్ కాదని, తను తాగింది టాక్సిక్ కెమికల్ వాటర్ అని. అలెర్టు అయిన సౌరభ్ వెంటనే కెమికల్ వాటర్ ని బయటకు కక్కాడు.


కానీ ఆ కెమికల్ వాటర్ కొంత మొత్తంలో సౌరభ్ కడుపులోకి వెళ్ళింది. దీంతో అతని పరిస్థితి నిమిషాలలో విషమంగా మారింది. ఇదంతా చూస్తున్న సౌరభ్ స్నేహితుడు సంతోష్... వెంటనే ట్రైన్ చైన్ లాగాడు. ఆపై రైలు నిలిపివేశారు.. గార్డ్ సౌరభ్ విషయం తెలుసుకొని... రైల్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారో వెతికారు. కానీ ఏ వైద్యుడు లేకపోవడంతో... సౌరభ్ కొంతసమయం వరకు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు.

రైల్వే పోలీసుల ప్రకారం, సౌరభ్ ప్రాథమిక చికిత్స అందక పోవడంతో మరణించాడని వెల్లడించారు. ఏదేమైనా.. కేవలం పబ్జి మొబైల్ ఆడటం వలన ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మరణించి వారి కుటుంబాలకి తీరని లోటుని మిగిల్చారు. బ్లూ వేల్ గేమ్ కంటే ప్రమాదకరంగా మారుతున్న పబ్జి ని బ్యాన్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: