ఈరోజుల్లో సమాజంలో ఆడవాళ్లు ఒంటరిగా రావాలంటేనే భయపడుతున్నారు ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలే. కొంతమంది దుర్మార్గులు సొంతం చెల్లి, తల్లి అని చూడకుండా హత్యలకు తెగపడుతున్నారు. అలాంటి ఈరోజుల్లో ఇలాంటి భర్త ఉండడం నిజంగా ఆశ్చర్యమే. తన భార్య పై ఈ భర్త చూపించిన ప్రేమ నిజంగా అద్భుతం.

 

వివరాల్లోకి వెళ్తే చైనా హెగాంగ్‌ నగరానికి చెందిన ఒక జంట హాస్పిటల్ కు వచ్చారు. తన భార్య గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం భర్త ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ ఉన్న ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ రావడానికి ఇంకా సమయం పడుతుంది అని చెప్పారు. దీనితో ఆ దంపతులు డాక్టర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది, భర్త తన భార్యను కూర్చోపెట్టాలని చూసాడు చుట్టూ చూసాడు అక్కడ ఉన్న కుర్చీలు ఏవీ ఖాళీగా లేకపోవడంతో తాను కింద కూర్చొని భార్యని తన వీపు మీద కుర్చోపెట్టుకున్నాడు.

 

ఇదంతా గమనిస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరూ తాము కూర్చున్న కుర్చీలో నుంచి లేచి ఆ భార్యకి కుర్చీ ఇచ్చి కూర్చోమని చెప్పలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను చైనా పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని తప్పుపట్టారు. ఇక నెటిజన్స్ కూడా హాస్పిటల్ లో అక్కడ ఉన్న వారి ప్రవర్తనను తప్పుపట్టారు.

 

భర్త చేసిన పనిని అభినందిస్తూ నెటిజన్స్ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇదీ ప్రేమంటే, భార్య కోసం నువ్వు చేసిన పనికి హ్యాట్సాఫ్, నువ్వు కదా అసలైన భర్త అంటే, హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అంటూ నెటిజన్స్భర్త ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక పోలీసులు విడుదల చేసిన ఈ వీడియో చాలా కొద్ది సేపట్లోనే ఐదు లక్షల వ్యూస్ పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: