పెళ్ళైన దంపతులు ఒకరిని ఒకరు సరదాగా తిట్టుకుంటూ ఉంటే, ఇంకా ఆటపాటిస్తుంటే.. చూడటానికి భలే సరదాగా అనిపిస్తుంది. అదే మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ అయితే... ఫిదా కావడం చాలా సహజం.

https://www.instagram.com/p/B6IeZOAl5CG/?igshid=1e5wcwz2we72f


మొన్న అనగా డిసెంబర్ 16న ధోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పాత వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ధోని భార్య సాక్షి ఒక అడ్వేర్టైస్మెంట్ లోని డైలాగ్ ని రీహార్సల్ చేస్తుంది. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆమె ఆ డైలాగ్ ని సరిగా చెప్పలేక తెగ ఇబ్బంది పడుతుంది. దీంతో పక్కనే కూర్చున్న ధోని విసిగిపోయి.. డైలాగ్ పేపర్ ని లాక్కొని.. '‘చూసి కూడా డైలాగ్ చెప్పలేకపోతున్నావ్.. ఇంకా డెలివర్ ఎలా చేస్తావ్’ అని లైట్ గా తిట్టి ఆమెకు తిరిగి పేపర్ ఇచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ డైలాగ్ చెప్పడానికి ట్రై చేసింది కానీ పాపం మళ్ళీ తడబడింది. దాంతో ఆమెతో సహా అక్కడ ఉన్నవారంతా పడిపడి నవ్వారు. ఈ వీడియో లో సాక్షి చాలా క్యూట్ గా ఉందని, తన ముచ్చటైన మాటలతో ఫిదా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



https://www.instagram.com/p/B518J9Onbsy/?igshid=185jhgpx5b9el


వాస్తవానికి, లాంగ్ హెయిర్ తో క్రికెట్ లో అరంగేట్రం చేసి.. అద్భుతమైన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది మనసులను దోచుకున్న ధోని సాక్షి మనసుని మాత్రం గెలుచుకోలేక పోయాడు. వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. కానీ ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించలేదు. పది సంవత్సరాలు తర్వాత అంటే 2007వ సంవత్సరంలో ఒక మ్యాచ్ కోసమని భారత క్రికెట్ జట్టు కోలకతాలోని 5-స్టార్ హోటల్ 'తాజ్ బెంగాల్' లో బస చేస్తున్నారు. అయితే ఆ టైంలో సాక్షి రావత్ కూడా అదే హోటల్ లో ఇంటర్న్ గా వర్క్ చేస్తుంది.

https://www.instagram.com/p/B5ryCkjHRF-/?igshid=yvq7nqlkmycg



సాక్షి ఇంటర్న్ గా తన చివరి రోజు విధులను నిర్వహిస్తున్నప్పుడు హోటల్ మేనేజర్ యుధాజిత్ దత్త ఆమెను ధోనికి పరిచయం చేశాడు. యుధాజిత్ దత్త, సాక్షి స్నేహితులు. కొంచెం సేపు సాక్షి ధోని తో మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ధోని యుధాజిత్ ను అడిగి ఆమె నెంబర్ తీసుకున్నాడు.

https://mobile.twitter.com/TrendsDhoni/status/1019995998569951232

ఆ తర్వాత పాపం, సాక్షి మనసుని గెలుచుకోవడానికి ధోని రెండు నెలల పాటు ఎంతో శ్రమించాడట. ఎట్టకేలకు ఆమెను తనని ప్రేమించేలా చేసి.. 2008లో ఆమెతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసాడు. ఆ తరువాత వీరిద్దరు జులై4, 2010 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని తన గారాల పట్టి జీవా, భార్య సాక్షి తో సమయం గడుపుతున్నాడు.

https://www.instagram.com/p/BzmPbWqnQUD/?igshid=8vvn7p6zndl2

మరింత సమాచారం తెలుసుకోండి: