ఉల్లిపాయల ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి.. సామాన్యుడు ఉల్లిపాయల్ని కొనాలంటే బెంబేలెత్తి పోతున్నాడు... "ఉల్లిపాయని కొస్తే కళ్ళమ్మట నీరు రావాల్సిందే" కాని ఇపుడు "ఉల్లిపాయని కొస్తేనే కాదు కొంటె కూడా కళ్ళమ్మట నీరువస్తుంది "భారీగా పెరిగిన ఉల్లి ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి.

 

ఓ దశలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.150కి చేరిందంటే.. ఉల్లి కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉల్లి సాగు విస్తీర్ణాన్ని రైతులు తగ్గించుకోవడంతోపాటు.. ఈ పంట పండడే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి.అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల్ని రైతు బజార్లలో తగ్గించి అమ్ముతున్నారు..

 

 

ఈ ఉల్లిపాయల కోసం జనం రైతుబజార్లలో లైన్లలో నుంచోలేక ప్రజలు కష్టపడుతున్నారు.. ఉల్లిపాయ లేనిదే కూర లేదు. ఉల్లి ఇచ్చే రుచి అలాంటిది మరి.. అందుకే ఎంత కష్టం అయిన లైన్లో నుంచుని మరి కొనుకుంటున్నారు.అప్పట్లో కేజీ ధర 15 రూపాయలు.. కాని సాగు సరిగా లేక, వర్షాలు పడడంతో పంట సరిగా పండలేదు. ఉల్లి సాగు సరిగా లేకపోవడం వల్ల కొరత వచ్చింది.. అందుకే ధర అమాంతం ఆకాశాన్ని అంటింది.. నిల్వ ఉంచుకున్న రైతు "రాజు "అయ్యాడు. కాని సంక్రాంతి కి ధర తగ్గవచ్చని నిపుణుల అభిప్రాయం. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

 

భారీ ఎత్తున ఉల్లిని నిల్వ చేయడంపై నిషేధం విధించింది. టర్కీ తదితర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. కానీ టర్కీ నుంచి వచ్చే 12,500 టన్నుల ఉల్లి దిగుమతులు డిసెంబర్ 27న భారత్ చేరే అవకాశం ఉంది. అవి అందుబాటులోకి వస్తే ధరలు తగ్గడం ప్రారంభం అవుతుంది..

 

అందరికి ఉల్లి అందుబాటులో ఉంటుంది... ఉల్లిపాయ లేనిదే కూర లేదు..ఉల్లిపాయ ఆరోగ్య పరంగా కూడా శరీరానికి మంచి చేస్తుంది... పెద్దలు అందుకే అంటారు "ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు" అని.... అంత ఉపయోగం ఉల్లిపాయ మనకి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: