చికెన్ అంటే నోరు ఊరిపోతోంది కదా !! చికెన్ బిర్యానీ తింటే ఆ ఫీలింగే వేరు.. పార్టీ ఆయన ఫంక్షన్ అయిన చికెన్ బిర్యానీ లేనిదే సంతృప్తి ఉండదు.. అయితే ఈ సంవత్సరం ఎక్కువగా చికెన్ బిర్యానీ కి జనాలు ఓట్లు వేశారు.. ఈ సంవత్సరం ఎన్ని సార్లు చికెన్ బిర్యాని తిన్నారో మీకు లెక్కవుందా? ఎన్ని సార్లు తిన్నా గాని తినాలి అనిపిస్తుంది గాని లెక్కపెట్టలేము కదా..

 

కాని హోటల్ లో మాత్రం లెక్క లెక్కే.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కొన్ని గంటల కిందటే 2019 రిపోర్టును విడుదల చేసింది. అంటే, ఈ ఏడాదిలో ఎక్కువగా డెలివరీ చేసిన ఐటమ్స్ లో టాప్ ప్లేస్ లో ఏవేవి నిలిచాయో లో వెల్లడించిందనమాట. స్విగ్గీ యానువల్ రిపోర్టు ప్రకారం మన దేశంలో ఈ ఏడాది జనం ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ చికెన్ బిర్యానీ.

 

దేశవ్యాప్తంగా సగటున నిమిషానికి 95 చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. అంటే, ఒక రోజులో దాదాపు 1.40 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయన్నమాట... ఈ సంవత్సరం మాత్రమే కాదు గత 5 సంవత్సరాలనుండి చికెన్ బిర్యానినే రారాజు గా నిలుస్తుంది.. స్విగ్గీ రిపోర్టు ప్రకారం ఫుడ్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ తర్వాతి స్థానం ‘మసాలా దోశ‘కు దక్కింది. మూడో ప్లేస్ లో పన్నీర్ బటర్ మసాలా..

 

నాలుగో స్థానాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ ఆక్రమించాయి. ఆ తర్వాతగానీ ఐదో ప్లేస్ లో మటన్ బిర్యానీకి చోటు దక్కింది. మళ్లీ ఆరో ప్లేస్ లో చికెన్ దమ్ బిర్యానీ.. ఆ తర్వాతి స్థానాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరీ చికెన్, దాల్ మఖని ఉన్నాయి... మటన్ బిర్యాని ఐదవ స్థానంలో ఉంది.. మటన్ రేటు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్డర్స్ తగ్గాయట..

 

స్విగ్గి డెలివరీ చేసిన అత్యంత ఎక్కువ రేటు కలిగిన బిర్యానీ 1500 అంట. పుణెకు చెందిన ఓ హోటల్.. ‘చికెన్ సజూక్ బిర్యానీ‘ పేరుతో తయారుచేసిన డిష్ ను అక్షరాలా 1500 రూపాయలకు డెలివరీ చేసినట్లు స్విగ్గీ చెప్పింది. ముంబైలో దొరికే 19 రూపాయాల ‘చాల్ ధానూ తవా బిర్యానీ‘ తాము డెలివరీ చేసిన వాటిలో తక్కువ ధర ఐటమ్ అని పేర్కొంది.

 

కిచిడి కి కూడా బాగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు.. అనూహ్యంగా కిచిడీ ఐటమ్ ఆర్డర్లు ఏటికేడు పెరుగుతున్నాయని, గతేడాదిలో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 128 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, ముఖ్యంగా ప్రజలు ఫుడ్ రూల్స్ ను గట్టిగా ఫాలోఅయ్యే నవరాత్రి సీజన్ లో కిచిడీ ఆర్డర్లు బాగా పెరిగాయని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్రకటించింది...

 

డీజర్ట్స్ విషయంలో గులాబ్ జామ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఫలూదా రెండవ స్థానంలో ఉందని తెలిపారు స్విగ్గీ యాజమాన్యం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: