ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినకపోతే, ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. ప్రతి ఒక్కరూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అత్యవసరం.మనం తినే ఆహారంలో అన్ని రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రాట్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్దాలు అన్ని సరయిన పాళ్ళలో ఉండాలి..

 

 

ఏ ఒక్కటి తగ్గినా నీరసం వస్తుంది. మనకి ఆకలి వేస్తుంది కదా అని ఎదో ఒకటి తినేస్తాము. క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే... ఎప్పుడూ నీరసంగా ఉండేవాళ్లు... గుడ్లు, పాలు వంటివి తింటే మంచిది. అదే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే. సరే ఇప్పుడు మనం... మనకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఆహారాలేంటో తెలుసుకుందాం.

 

 

ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పౌష్టికాహారం కోసం మనం లక్షలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. రోజువారీ తినే ఆహారంలోనే ఎక్కువ పోషకాలు ఉన్నవి, ప్రోటీన్స్ ఉన్నవి తింటే మేలు. పౌష్టికాహారం తింటే... అధిక బరువు లేకుండా ఉండటమే కాదు... కండరాలు బలంగా మారతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలేంటో తెలుసుకుందాం.

 

 

మొదటగా మన బిజీ లైఫ్ లో డైలీ పాలు తాగడం అలవాటు చేసుకోవాలి.. పాలల్లో ఎన్నో రకాలయిన పోషక పదార్ధాలు ఉంటాయి. క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే బి -కాంప్లెక్స్ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా కోడిగుడ్డు చాలా మంచిది .
బయో ప్రోటీన్స్ కావాలంటే... ఎగ్స్ తినాల్సిందే. గుడ్లతో రకరకాల వంటలు వండుకోవచ్చు. ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఎగ్స్ కర్రీ రుచికరంగా చేసుకోవచ్చు. ఎగ్స్ శాండ్‌ విచ్ కూడా ఆరోగ్యదాయకమే. అందువల్ల రోజూ కనీసం రెండు గుడ్లు మీ డైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి.ఇంకా చికెన్, చేపల లో కూడా ప్రోటీన్స్
ఉంటాయి. బాదాం పప్పులు కూడా శరీరానికి సరిపడా మాంసకృతులను ఇస్తాయి ..

 

 

బాదాం పప్పులు రాత్రి పూట నీటిలో నానబెట్టుకుని ఉదయం తింటే చాలా మంచిది. తాజాకూరగాయాలలో కూడా పోషకాలు లభిస్తాయి.. ఐరన్, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, విటమిన్స్ చాలా ఉంటాయి.. పప్పుధాన్యాల్లో కూడా ప్రోటీన్స్, కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి మూడు సార్లు అయిన కందిపప్పు, పెసరపప్పు తింటూ ఉండాలి.. ఆకుకూరలతో పప్పు చేసుకుని తింటే శరీరానికి మంచిది.





మరింత సమాచారం తెలుసుకోండి: