`విటమిన్ సి` నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరంలో మంచి సెల్యులార్ గ్రోత్ కు మరియు బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ప్రొపర్ ఫంక్షనింగ్ కోసం సహాయపడుతుంది . విట‌మిన్ సి ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ఆస్వాదించేందుకు మ‌న‌లో అధిక శాతం మంది అంత‌గా ఆస‌క్తి చూపించ‌రు. కొంచెం పుల్లగా ఉండే సిట్రస్ పండ్లపై ఎవ‌రికీ అంత ఇష్టం కూడా ఉండ‌దు. అయితే వీటిని పక్కన పెడితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.

 

అయితే మన శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే... బరువు తగ్గే అవకాశాలు తగ్గిపోతాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో విటమిన్ సి లోపం కూడా ఒకటి. విటమిన్స్ సి లోపం వల్ల అలసట, దంతక్షయం, దంతవాపులు, జాయిట్ పెయిన్ , గాయాలు మాన్పడం, దంతాల్లో రక్తం కారడం, హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మార్చడం వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది. అయితే విట‌మిస్ సి వ‌ల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

 

ఇది గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా విటమిన్ సి చాలా అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు ఏంటంటే.. నిమ్మకాయ, ఉసిరి, నారింజ, కివి, ద్రాక్ష, టమాటా, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీల‌లో విట‌మిస్ సి పుష్క‌లంగా ఉంటుంది. సో.. విట‌మిన్ సి పుష్క‌లంగా ఉన్న ఆహారం తీసుకోవ‌డం శ‌రీరానికి చాలా అవ‌స‌రం.

మరింత సమాచారం తెలుసుకోండి: