లాటరీని గెలవడం అనేది జీవితాన్ని మార్చే అనుభవమని, ఆ లాటరి డబ్బును తెలివిగా ఖర్చు చేస్తే సంపన్న భవిష్యత్తుకు దారితీస్తుందని చెప్పొచ్చు. మీరు లాటరి విజయాల గురించి ప్రపంచానికి లైవ్ లో అప్‌డేట్ చేస్తున్నప్పుడు వేరొకరు మిలియన్ డాలర్లను గెలుచుకుంటుంటే కొంచెం బాధగానే ఉంటుంది. నటాలియా ఎస్కుడెరో అనే స్పానిష్ రిపోర్టర్ కూడా అచ్చం అలాగే ఫీల్ అయ్యింది.


వివరాల్లోకి పోతే, స్పానిష్ క్రిస్టమస్ లాటరీ సంవత్సరిక ఫలితాలను లైవ్ కవరేజ్ అందించడానికి స్పానిష్ ఆర్.టీ.వి.ఈ రిపోర్టర్ నటాలియా ఎస్కుడెరో వెళ్ళింది. గతంలో ఆమె కూడా ఒక క్రిస్టమస్ లాటరి టికెట్ ని కొనుకోలు చేసుకుంది. ప్రపంచంలోనే ఈ లాటరి డ్రా చాలా ధనవంతమైంది. సుమారు $3.37 బిలియన్ కోట్లను 40 మందికి రకరకాల మొత్తంలో పంచుతారు ఈ లాటరి నిర్వాహకులు.


అయితే, 4 రోజుల క్రితం RTVE రిపోర్టర్ నటాలియా, ప్రత్యక్ష ప్రసారంలో ఫలితాలు ప్రకటించినప్పుడు ఆమె కొన్న టికెట్ కు స్పానిష్ క్రిస్మస్ లాటరి తగిలిందని తెలిసింది. దాంతో ఆమె లైవ్ టీవీ లో రిపోర్టర్ బాధ్యతలు నిర్వహించాల్సింది పోయి.. అక్కడ ఉన్న మిగతావారితో చిందులేస్తూ.. ముద్దులు పెట్టించుకుంటూ.. గట్టిగా అరుస్తూ.. నానా హంగామా చేసింది. లాటరి గెలిచాను కదా. ఇక నేను ఈ రిపోర్టర్ జాబ్ మానేసి, లాటరి డబ్బులతో అప్పులు తీర్చి హాయిగా జీవిస్తా అని లైవ్ షో లోనే ప్రకటించింది. 'నేను రేపు పనికి వెళ్ళడం లేదు', అని అరిచింది. ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ ప్రత్యక్ష ప్రసార వీడియో వైరల్ కూడా అయ్యింది.


వాస్తవానికి, ఈ లాటరి లో ప్రతి గెలిచిన టికెట్ కు రూ. 32 కోట్లు ప్రకటిస్తుంది ఆ సంస్థ. నటాలియా కూడా అదే అనుకుంది. కానీ, చివర్లో ఆమె టికెట్ గెలుచుకుంది కేవలం రూ.4 లక్షలు అని తెలియడంతో ఆమె గుండె బద్దలైంది. జాబ్ మానేస్తున్నానని అనవసరంగా చెప్పానని పశ్చాత్తాప పడుతుంది. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లు ఆమె చేసిన రచ్చకి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: