కొత్త ఆశలు పురివిప్పే వేళ వచ్చస్తోంది. మ‌రో రెండు రోజుల్లో 2019కి గుడ్ బై చెప్పి.. 2020కి వెల‌క‌మ్ చెప్ప‌బోతున్నాం.  హ్యాపీ న్యూఇయర్ అంటూ అందరినీ ఆనందంగా పలుకరిస్తే ఈ ఏడాదంతా సంతోషంగా ఉంటారని నమ్మకం. 365 రోజుల ఆనందం ఒక్కరోజులో చూసుకునే ఈ రోజు అంద‌రినీ ఎంతో ఆనందంగా ఉంచుతుంది. మన దేశంలోనే న్యూఇయర్‌.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇక‌ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌లో కొత్త విషయాలు తెలుసుకుందాం. ప్ర‌స్తుతం మనం ఫాలో అవుతున్నది జూలియన్ కేలండర్ లేదా గ్రెగొరియన్ కేలండర్. దీని ప్రకారమే జనవరి 1ని సంవత్సరంలో మొదటి రోజుగా భావిస్తున్నారు. 

 

అయితే.. క్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల నుంచే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిసింది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకల్ని ఒకే సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారు. ఎందుకంటే టైమ్ జోన్ల సమస్య. వాస్త‌వానికి సూర్యుడు ముందుగా ఉదయించే ప్రదేశంగా జపాన్‌ని చెప్పుకుంటారు. కానీ న్యూఇయర్ వేడుకలు మాత్రం ప్రపంచంలో ముందుగా జరిగేది న్యూజిలాండ్‌లో. అక్కడి ఛాధమ్ దీవుల్లో రాత్రి 12 అవ్వగానే న్యూఇయ‌ర్ వేడుక‌లు స్టాట్ అవుతాయి. ఇక అందరూ వేడుకలు జరిపేసుకున్నాక... చివరిగా అమెరికాలోని సమోవా దీవుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటారు.

 

మ‌రి ఒకే రోజులో రెండుసార్లు న్యూఇయర్ జరుపుకునే ప్రదేశంగా ఛాధమ్, సమోవా దీవుల సముదాయాన్ని పిలుస్తారు. ఎందుకంటే వీటి మధ్య దూరం 891 కిలోమీటర్లే. అయితే ఎవరైనా ఒకే రోజు రెండుసార్లు న్యూఇయర్ జరుపుకోవాలనుకుంటే మాత్రం ముందుగా డిసెంబర్ 31 అర్థరాత్రికి ఛాధమ్ దీవులకు చేరాలి. అదే రోజు రెండోసారి జరుపుకునేందుకు ఫ్లైట్ ఎక్కి సమోవా దీవుల్ని చేరుకుంటే స‌రిపోతుంది. అప్పుడు ఒకే రోజు రెండు సార్లు న్యూఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోవ‌చ్చు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: