కొత్త సంవత్సర వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటే సంబరాలతో యువత, పెద్దలు అనే భేదం లేకుండా అంతా కులమతాలకు అతీతంగా ఆనందంతో జరుపుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ పాత సంవత్సరం బాధలను వదిలేస్తూ ఆనందంగా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాదులో ఈ అంబరాలు ఎంతో సందడిగా జరిగాయి.  2019 కి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలకు జీవం పోస్తూ 2020 స్వాగతం చెబుతూ హైదరాబాద్ వాసులు ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తామని నగర యువత చెబుతున్నారు. మరికొంతమంది ప్రకృతిపై ప్రేమను వ్యక్తం చేస్తూ కొత్త సంవత్సరంలో మొక్కలు నాటి నగరంలో కాలుష్యం తగ్గించేందుకు తమవంతుగా ప్రయత్నిస్తామని చెబుతున్నారు.


 నగర యువత ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా నగరంలోని హోటళ్లు, రిసార్ట్స్, పబ్బులు సరికొత్త ఈవెంట్స్ తో కలర్ ఫుల్ గా కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించాయి. ఈ వేడుకలకు భారీగా యువత హాజరయ్యారు. ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్లతో నగరానికి చెందిన డీజే లు పృద్వి, కిమ్స్, ఎంసి గ్రేస్, తదితరులు మ్యూజిక్ సాంగ్స్ తో అలరించారు పాటలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ కొత్త సంవత్సరం వేడుకలను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పోలీసు శాఖ తరపున డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగరంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ, ప్రశాంతంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగేలా చేశారు.

 

 సెక్రటరియేట్ ఫ్లైఓవర్ దగ్గర అంజనీ కుమార్ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసారు. నగరంలో ఉన్న ప్రముఖులు, సినిమా ఇండ్రస్ట్రీ, రాజకీయ నాయకులు తదితరులకు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున బొకేలు, పూలదండలతో వారి అభిమానులు హడావిడి చేయడం కనిపించింది. మొత్తంగా కొత్త సంవత్సర వేడుకలు నగరవాసుల్లో మంచి జోష్ ను నింపాయి. 2020 సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు అందరూ తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: