కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. ప్రజలంతా కొత్త సంత్స‌రానికు స్వాగతం చెప్పటానికి సిద్ధమైపోయారు. హైదరాబాద్ నగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడానికి యూత్ హంగామా మాములుగా చేయ‌లేదు. ఇక కొత్త సంవత్సర వేడుకలు అంటేనే రకరకాలుగా ఉంటాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు వారి స్థాయిలో వేడుకలు నిర్వహించుకుంటారు. ఇక ఇదే సమయంలో కొత్త సంవత్సరం మొదటి రోజు తమ ఇష్ట దైవాల్ని పూజించాలని కోరుకుంటారు. ఉదయాన్నే ఆలయాలవైపు అడుగులు వేస్తారు. హైదరాబాద్లో చాలా దేవాలయాలు భక్తుల కొంగు బంగారంలా భాసిల్లుతున్నాయి. 

 

మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ వేళల్లో ఎన్టీఆర్, నెక్లస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వ‌లేదు. దీంతో యూత్ ఎక్క‌డిక‌క్క‌డే రోడ్ల మీద బండ్ల‌ను నిలిపి వారు నిల్చున్న చోటే కేక్‌ను క‌ట్ చేసుకుని హంగామా చేశారు. ఎప్పుడూ రెండు మూడు గంట‌ల వ‌ర‌కు తిరిగే యూత్ పోలీసుల ఆంక్ష‌లు, మ‌రోప‌క్క ఇక్క‌డి చ‌లి రెండిటి వ‌ల్ల ఒక‌ర‌కంగాచెప్పాలంటే రోడ్లు త్వ‌ర‌గానే ఖాళీ అయ్యాయ‌ని చెప్పాలి. కానీ ఉన్నంత వ‌ర‌కు మాత్రం ఎక్క‌డి క‌క్క‌డ ఈవెంట్‌లు చేసి డీజేలే యూత్ చేసే జోషే వేరులే అన్న‌ట్లు ఉంది. 

 

వీవీ స్టాచ్యూ నుంచి నెక్లస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు వైపు మళ్లించారు. లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను జీహెచ్ఎంసీ ఆఫీస్ వై జంక్షన్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, లక్డీ కపూల్ వైపు మళ్లించారు. కొంత మంది యూత్ ఇలాంటి ఆంక్ష‌ల‌న్నీ ఉండ‌డంతో ఎక్క‌డికక్క‌డ రోడ్ల మీద కొంద‌రు ఎంజాయ్ చేస్తే ఇంకొంద‌రు ఇళ్ళ‌లోనే పార్టీల‌ను ఎరేంజ్ చేసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్, సెక్యూరిటీ ప్రాబ్ల‌మ్స్ ఏమీ లేకుండా ఎవ‌రికి వారు ఎంజాయ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: