యూరప్‌లో 6 రోజులు యూరప్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఒక్కో దేశానిది ఒక్కో తరహా. ఇక్కడ ప్రతీ దేశం ఒక ప్రత్యేక శైలిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌ను తీసుకుంటే ఇక్కడ జనవరి ఒకటవ నుంచి జనవరి 6 వరకు సెలవు రోజులుగా పాటిస్తారు. జనవరి 6న ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్‌ చేయడం ద్వారా కొత్త సంవత్సర వేడుకలకు ముగింపు పలుకుతారు.

 

ఫ్రాన్స్‌లో ఈ వేడుకలు ఎక్కువగా ప్రైవేట్‌గా జరుపుకుంటారు. కొన్ని చోట్ల 'టార్చ్‌లైట్‌' ప్రాసెషన్‌లో పాల్గొంటారు. బ్రిటన్‌లో కొత్త సంవత్సర వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తారు. థీమ్‌ పార్టీలు, సల్సా డాన్స్‌లతో వేడుకలు ఆద్యంతం కన్నుల పండుగగా జరుగుతాయి. కొన్ని చోట్ల లైవ్‌ షోలను కూడా నిర్వహిస్తారు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉరిమే ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటారు. పండుగైనా, ఉత్సవమైనా... ఒక్కో దేశంలో ఒక్కోలాగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నూతన సంవత్సర వేడుకలు కూడా. కొన్ని దేశాల్లో ప్రజలు పార్టీలు, పబ్‌లకు అంకితమైతే.. మరికొన్ని దేశాల్లో కుటుంబ సమేతంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. న్యూజీలాండ్ లో బాణాసంచా కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: