ప్రపంచంలో నూతన సంవత్సర వేడుకలు భారీగా జరిగేది ఎక్కడా అని అడిగితే.. దానికి సమాధానం 'బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో' అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


న్యూ ఇయర్ సందర్భంగా... ప్రపంచంలోనే బాగా పేరుగాంచిన కోపకాబాన బీచ్ కు 30 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఇంకో విషశమేంటంటే.. ఆ బీచ్ లో 15,420 కిలోల బాణాసంచా కాల్చారు. అంటే, ఎన్ని లక్షల బాణాసంచానో ఒక్కసారి ఊహించుకోండి. ఇక, అన్ని లక్షల బాణాసంచా ఆకాశంలోకి దూసుకుపోయి 15నిమిషాల పాటు కనుల విందు చేశాయంటే ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

https://mobile.twitter.com/andreaj0103/status/1212218688625135617

 

అర్ధరాత్రి రంగురంగుల బాణాసంచా ఆకాశాన్ని నింపేస్తున్నపుడు..ఆ బీచ్ లో ప్లే చేస్తున్న సూపర్ సంగీతాన్ని అనుభవిస్తూ, టేస్టీ డ్రింక్స్ ఆస్వాదిస్తూ సూపర్ గా ఆనందించారట ఆ 30లక్షల మంది వీక్షకులు. ఆకాశంలో కాలుతున్న రంగురంగుల బాణాసంచా బీచ్ ఎదుట ఉన్న నీటిపై ప్రతిబంబించి.. ఆ ప్రాంతం మొత్తం మరొక ప్రపంచంలాగా తలపించింది. అందుకే ఇదీ అసలైన న్యూ ఇయర్ పార్టీ అంటే అని ఈ వేడుకలను చూసిన నెటిజన్లు అంటున్నారు.

https://mobile.twitter.com/joaopedroses/status/1212223898336604160


ఇకపోతే, బీచ్ కు వచ్చిన చాలా మంది శాంతికి చిహ్నమైన తెలుపు రంగు వస్ర్తాలను ధరించారు. ఇంటర్నెట్ లో దొరికిన కొన్ని వీడియోల్లో ఆడవారు ఎక్కువగా వైట్ డ్రెస్సులను ధరిస్తే.. మగవారు మాత్రం షర్టులిప్పి నీటిలో దూకుతూ ఎంజాయ్ చేసారని తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగిన కోపకాబానా బీచ్ పార్టీలో 2000 పోలీసులు భద్రత కల్పించగా...పార్టీలో ఎటువంటి అపశృతి జరగలేదని తెలిపారు వాళ్లు. బీచ్ వద్దకు వచ్చిన టూరిస్టులు తెల్లవారుజాము వరకు అక్కడే ఉండి.. ఆ తరువాత ఆ సముద్రపు నీటిలో ఒకసారి మునుగుతారు. ఈ విధంగా చేస్తే.. వారి కష్టాలు ఆ సముద్రంలో కలిసిపోతాయని వారి నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా బీచ్ ఒడ్డున బ్రెజిల్ వారు తమ మత ఆచారాలు పాటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: