పాత సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌లికి.. కోటి ఆశ‌ల‌తో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టాం. ఈ నేప‌థ్యంలోనే దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. సరికొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్సులు, కేక్‌ కట్టింగ్‌లు, పార్టీలతో హోరెత్తించారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా న్యూ ఇయర్‌ వేడుకలను తమదైన స్టైల్‌లో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

 

అంతేకాదు గత ఏడాదిని గుర్తు చేసుకుంటూ కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్ ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు త‌మ కుటుంబ స‌భ్య‌ల‌తో హైదరాబాద్ లోనే జరుపుకున్నారు. దీంతో  ఎన్టీఆర్‌ ఇంటి ముందు ఫ్యాన్స్‌ సందడి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తారక్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడారు. వారిని పలకరించేందుకు తారక్‌ మేడపైకి వచ్చారు. అందరికీ అభివాదం చేసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 

అలాగే ``అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను`` అంటే ఆమ‌ర ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. వాస్త‌వానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఇప్పటి వరకు బీజీగా ఉన్నారు. ఇటీవలే ఔట్ డోర్ లోకేషన్లో షూటింగ్ జరిగింది. జూన్ 30లోగా సినిమాను రిలీజ్ చేయాలని జక్కన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. జక్కన్న అంటే ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బీజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తున్నారు, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. దీంతో ఈ సారి ఇత‌ర కంట్రీస్కు వెళ్ల‌కుండా ఈ న్యూఇయర్‌ను కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోనే జరుపుకున్నాడు ఎన్టీఆర్‌.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: