ఒక చైనీస్ యువతి తన కాబోయే భర్తని మోసం చేసి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించింది. కానీ ముందుగానే తన కాబోయే భర్త ఈమె గురించి ఒక పచ్చి నిజం తెలుసుకున్నాడు. అదేంటంటే అతని కాబోయే భార్య తన సిస్టర్ మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని. కానీ అతడు ఈ ఈ విషయాన్ని తన మనసులోనే ఉంచుకున్నాడు. పెళ్లి మండపంపై ఆ యువతి యొక్క నిజమైన రూపాన్ని బయటపెట్టాలని నిశ్చయించుకున్నాడు.


వివరాల్లోకి పోతే, ఒక చైనీస్ జంటకు గ్రాండ్ గా ఒక పెళ్లి మండపంలో వివాహ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యుల బంధువులు వీరి వివాహ వేడుకలను వీక్షిస్తున్నారు. అప్పుడే తెల్లటి పెళ్లి వస్త్రాలలో వధువు వరుడి చెయ్యి పట్టుకుని పెళ్లి మండపం పైకి వచ్చింది. ఇద్దరూ అలా స్టేజ్ మీద నిలుచున్నప్పుడు.. చైనీస్ మత పెద్దలు ఏవో వారి సాంప్రదాయక మంత్రాలను చదివారు. కొన్ని నిమిషాల తర్వాత వారి వెనకే ఒక పెద్ద స్క్రీన్ పై పెళ్లి కూతురుతో సహా తన చెల్లి భర్త కనిపించాడు. ఆ స్క్రీన్ మీద ఏం కనబడుతుందో అర్థంకాక, ఏం జరగబోతుందోనని ఆ పెళ్లి వేడుకలో ఉన్న బంధువులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు.


ఆ సందర్భంలోనే ఆ వీడియో పూర్తిగా ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. దాంట్లో వధువు, ఇంకా తన సిస్టర్ భర్త కలిసి శృంగారం చేయడం ప్రారంభించారు. ఇది చూసిన బంధువులు అంతా ఒకేసారి గట్టిగా అరిచారు. తన వెనుక ఏం జరుగుతుందా అని పెళ్లికూతురు వెనక్కి తిరిగి చూడగానే ఆమె ఆ స్క్రీన్ పై నగ్నంగా ఉంది. దాంతో షాకయిన వధువు వెంటనే వరుడి మీదకి ఒక పూల బౌకే ని విసిరింది. అప్పుడు వరుడు మాట్లాడుతూ..' నాకు నీ విషయం తెలియదని అనుకుంటున్నావా?' అని ఆమె మొహం మీద గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్న అమ్మాయి బంధువులు వెంటనే పెళ్లి కుమార్ పై దాడి చేశారు. అంతటితో వీడియో ముగుస్తుంది.


అయితే, ఈ వీడియో మొత్తం పోర్న్ సైట్లలో విడుదలవడంతో వధువు తన పరువు పోయిందని మానసికంగా కృంగిపోతుంది. వధువు కుటుంబ సభ్యులు ఆ వీడియో ని డిలీట్ చేయాలని వరుడిని డిమాండ్ చేశారు. కానీ ఒకసారి పరువు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ వరుడు తన కాబోయే భర్త రాసలీలలు ఎలా కనిపెట్టాడంటే.. ఒకరోజు భార్య యొక్క చెల్లి ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక నిఘా కెమెరా వీడియో రికార్డులను చూశాడు. అప్పుడే వధువు తన సిస్టర్ భర్తతో ఏకాంతంగా గడపడం చూశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: